Tuesday, November 26, 2024

ఏటేటా పెరుగుతున్న అప్పుల భారం.. ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్రమంత్రి బదులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌ అప్పులు 2019తో పోలిస్తే దాదాపు రెండింతలయ్యాయని కేంద్రం వెల్లడించింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదురి మంగళవారం రాతపూర్వక సమాధానంలో వివరాలు వెల్లడించారు. ఏపీ అప్పుల భారం ఏటేటా పెరుగుతోందని చెప్పారు.

బడ్జెట్ లెక్కల ప్రకారం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అప్పు రూ.4, 42, 442 కోట్లు అని పంకజ్ చౌదురి తెలిపారు. 2019లో అప్పు రూ.2,64, 451 కోట్లు ఉండగా, 2020లో రూ.3,07, 671 కోట్లు, 2021లో రూ.3,53,021 కోట్లు, 2022లో రూ.3,93,718 కోట్లు కాగా, 2023 బడ్జెట్ అంచనాల ప్రకారం రూ.4,42,442 కోట్లకు చేరిందని తెలిపారు. బడ్జెట్ అప్పులకు తోడు, కార్పొరేషన్లు సహా ఇతర మార్గాల్లో ఏపీ చేస్తున్న అప్పులు అదనమని కేంద్ర మంత్రి వెల్లడించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement