సేన (ఎస్‌ఈఎన్‌ఏ)గా పిలిచే సౌత్ ఆఫ్ర్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా)గా పిలిచే క్రికెట్ దిగ్గజ జట్లపై భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన పదునైన బౌలింగ్‌తో మరో రికార్డు సృష్టించాడు. ఆ నాలుగు జట్లపై వారిగడ్డపైనే వంద వికెట్లు (101) పడగొట్టి సంచలనం రేపాడు. ఇలా వంద వికెట్లు సాధించిన భారత బౌలర్లలో ఆరో ఆటగాడిగా నిలిచాడు.
ఇంగ్లండ్‌తో జరిగిన చివరి, ఐదవ టెస్ట్ మ్యాచ్ 4వ రోజు ఆటలో ఓపెనర్ క్రాలీని ఔట్ చేయడంద్వారా బుమ్రా ఈ రికార్డు సృష్టించాడు. అంతకుముందు అనిల్ కుంబ్లే (141), ఇషాంత్ శర్మ (130), జహీర్‌ఖాన్ (119), మహమ్మద్ షమీ (110), కపిల్‌దేవ్ (119) ఈ జాబితాలో చోటు సంపాదించారు. ఈ నాలుగు జట్టలో ఇంగ్లండ్‌పైనే బుమ్రా అత్యధికంగా 37 వికెట్లు పడగొట్టాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.