గాయసడిన టీమిండియా స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఫిట్‌నెస్ గురించి భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక అప్‌డేట్ అందించింది. బుమ్రాకు సర్జరీ విజయవంతంగా పూర్తైందని తెలిపిన బీసీసీఐ.. ప్రస్తుతం ఈ స్పీడ్‌స్టర్ వెన్నునొప్పి నుంచి పూర్తిగా కోలుకున్నట్లు వెల్లడించింది. న్యూజిలాండ్‌లో విజయవంతంగా శస్త్రచికిత్స చేయించుకున్న జస్ప్రీత్ బుమ్రా శుక్రవారం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సిఎ)కి వచ్చాడు.
రెండు నెలల తర్వాత ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరిగే భారత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అతను ఫిట్‌గా ఉంటాడో లేదో చూడాలి. ఇక శ్రేయస్ అయ్యర్‌కు వచ్చే వారం సర్జరీ జరుగనుందని పేర్కొంది. వెన్నునొప్పితో బాధపడుతున్న అయ్యర్ రెండు వారాల పాటు డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉంటాడని.. తర్వాతే జాతీయ క్రికెట్ అకాడమీకి వస్తాడని బీసీసీఐ తెలిపింది