ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై భారత స్టార్ బౌలర్, యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. బంతితో చెలరేగిన బుమ్రా… ఐదు టెస్టుల్లో 13.06 సగటుతో మొత్తం 32 వికెట్లు తీసి.. పలు రికార్డులను బద్దలు కొట్టాడు. ఈ క్రమంలో తాజగా ప్రతిష్టాత్మక ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది మంత్ (డిసెంబర్) అవార్డుకు బుమ్రా ఎంపికయ్యాడు.
బుమ్రాతో పాటు ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్, దక్షిణాఫ్రికా సీమర్ డేన్ ప్యాటర్సన్ కూడా పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయ్యారు.