టీమిండియా యువ స్టార్ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌కు బీసీసీఐ బంపర్ ఇచ్చింది. టీ20 ప్రపంచకప్ తర్వాత టీం ఇండియా జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్ కోసం టీ20 ప్రపంచకప్‌లో ఆడుతున్న ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతినిస్తుంది. దీంతో జింబాబ్వే పర్యటనకు బీసీసీఐ శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. జింబాబ్వే పర్యటనకు శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా నియమిస్తూ… 15 మందితో కూడిన జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది.
జింబాబ్వేతో జరగనున్న ఐదు టీ20ల సిరీస్ జులై 6వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. భారత కాలమాన ప్రకారం మ్యాచ్‌లన్నీ సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. జులై 6న, జులై 7న తొలి రెండు టీ20లు, జులై 10, జులై 13, జులై 14వ తేదీల్లో చివరి మూడు టీ20లు జరగనున్నాయి.
జింబాబ్వేతో టీ20 సిరీస్ కు భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్), ధృవ్ జురెల్ (వికెట్), నితీష్ రెడ్డి, రియాన్ పరాగ్, రవిష్నో సుందర్, వాషింగ్టన్ సుందర్ అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్ పాండే.