ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయెల్ తన ధాతృతం చాటుకున్నాడు. ఏకంగా రూ.700 కోట్లను డొనేషన్‌గా ప్రకటించాడు. జొమాటో ఫ్యూచర్ ఫౌండేషన్ కార్యకలాపాల కోసం ఈ భారీ విరాళాన్ని అందజేశాడు. ఈ మేరకు కంపెనీ ఉద్యోగులందరికీ.. ఈ మెయిల్స్ ద్వారా దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని చేరవేశారు. ఎంప్లాయి స్టాక్ ఓనర్‌షిప్ ప్లాన్ (ఈసోప్స్) కోసం ఈ నిధులను కేటాయించాల్సి ఉంటుంది. జొమాటో డెలివరీ పార్టనర్స్ ఇద్దరు పిల్లలకు చదువు చెప్పించడానికి లక్ష రూపాయాలను కేటాయిస్తుంది. అయిదేళ్ల సరీస్‌ను పూర్తి చేసుకున్న వారు పదేళ్ల సర్వీస్‌ను పూర్తి చేసుకున్నవారు దీనికి అర్హులు. అదే పదేళ్ల సర్వీసును పూర్తి చేసుకుని ఉంటే.. వారి ఇద్దరు పిల్లల చదువు కోసం రూ.2లక్షలు అందిస్తుంది.
సర్వీస్ ఆధారంగా సాయం..
5/10 ఏళ్ల సర్వీస్ ఉన్న మహిళా ఫుడ్ డెలివరీ పార్టనర్స్ కోసం అదనపు సౌకర్యాన్ని కల్పించింది. 12వ తరగతి పూర్తి చేసుకున్న ఆడ పిల్లల కోసం ప్రైజ్ మనీని ప్రవేశపెట్టింది. ఉద్యోగులు, సిబ్బంది పిల్లల ఉన్నత విద్యాభ్యాసం కోసం ప్రత్యేకంగా స్కాలర్‌షిప్ వ్యవస్థను ప్రవేశపెడుతుంది. విధి నిర్వహణలో ఉంటూ ప్రమాదానికి గురైన ఫుడ్ డెలివరీ పార్ట్‌నర్స్ కుటుంబాలను ఆదుకోవడానికి వారి పిల్లల చదువుల కోసం కూడా ఈ 700 కోట్ల నుంచి ఖర్చు చేయనున్నట్టు తెలిపింది. ఈ విషయంలో సర్వీస్‌తో పని లేదని, కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి కూడా ఈ సౌకర్యం వర్తిస్తుందని తెలిపింది. మరిన్ని వసతులు, సౌకర్యాలను తన సంస్థలో పని చేస్తోన్న ఉద్యోగుల కోసం ప్రవేశపెడుతామని దీపిందర్ గోయెల్ తెలిపారు. దీని కోసం జొమాటో ఫ్యూచర్ ఫౌండేషన్స్ కోసం పెద్ద ఎత్తున విరాళాలను సేకరించనున్నట్టు వివరించారు. ఉద్యోగులు బాగుంటేనే సంస్థ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని విశ్వసిస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి కార్యాచరణ ప్రకటిస్తామని వివరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..