యూపీలో బుల్డోజర్లు మళ్లి రోడ్డెక్కాయి. సీఎం యోగీ ఆదేశాలతో.. పరారీలో ఉన్న నిందితులను కటకటాల వెనక్కి నెట్టేందుకు యూపీ అధికారులు సిద్ధం అవుతున్నారు. సహరన్పూర్ జిల్లాలో ఓ గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ దారుణమైన ఘటనకు పాల్పడిన నిందితులంతా.. పరారీలో ఉన్నారు. పోలీసులు ఎంత వెతికినా దొరకలేదు. దీంతో యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం బుల్డోజర్లను రంగంలోకి దించింది. 24 గంటల్లో నిందితులు లొంగిపోని పక్షంలో వారి ఇళ్లను బుల్డోజర్లతో నేలమట్టం చేస్తామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో వెంటనే నిందితులంతా.. గంటల వ్యవధిలోనే పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయారు.
సహరన్పూర్ జిల్లాలోని చిల్కానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు అన్నదమ్ముళ్లు కలిసి ఓ గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. వారి ఆచూకీ దొరక్కపోవడంతో.. పోలీసులు బుల్డోజర్లతో జలాల్‌పూర్‌కు వెళ్లారు. ఆ తరువాత ఇళ్ల కూల్చివేత విషయమై దండోరా వేయించారు. అదే రోజు రాత్రి నిందితులు ఇద్దరూ పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోవడం గమనార్హం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..