Thursday, November 21, 2024

జులై 5న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం.. వైభ‌వంగా నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం ఏర్పాట్లు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణాన్ని జులై 5వ తేదీన వైభవంగా నిర్వహించనున్నట్లు పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. వివిధ శాఖల అధికారు లతో ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం నిర్వహణ, ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జులై 4వ తేదీన ఎదుర్కోళ్ళు, 5వ తేదీన కళ్యాణం, 6వ తేదీన రథోత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అమ్మవారి కళ్యాణాన్ని భక్తులు లైవ్‌లో చూసేవిధంగా టీవీలలో ప్రసారం చేస్తా మన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో అమ్మవారి కళ్యాణం, బోనాలు పండుగలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహి స్తున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడం అంశాలను దృష్టిలో ఉంచుకుని వచ్చే భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తామన్నారు.

తోపులాటకు అవకాశం లేకుండా అలాగే భక్తులు అసౌకర్యానికి గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సు లను నడుపుతామన్నారు. శాంతిభద్రతల్లో భాగంగా పోలీసు బందోబస్తుతో పాటు సీసీ కెమోరాలను ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి తలసాని సూచించారు. రహదారుల మరమ్మతులు ఉంటే ఇప్పటి నుండే పనులు ప్రారం భించాలని అధికారులకు ఆయన సూచించారు. అమ్మవారి రథోత్సవం యాత్రకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్‌ తీగలను సరిచేసి, చెట్ల కొమ్మల తొల గింపు చర్యలు చేపట్టాలన్నారు. దర్శనం పాస్‌ల జారీలో డూప్లికేషన్‌కు ఆస్కారం లేకుండా బార్‌ కోడింగ్‌లతో కూడిన పాస్‌లను జారీ చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సమీక్షలో దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌, ఆలయ కమిటీ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement