చైనాలోని షెంజెన్ నగరంలో 300 మీటర్ల ఎత్తు ఉన్న ఓ బిల్డింగ్..అకస్మాత్తుగా షేక్ అయ్యింది. స్పెషల్ ఎకనామిక్ జోన్‌లో ఉన్న ఆ బిల్డింగ్ చాలా సేపు ఊగిపోవడంతో దాంట్లో ఉన్న వ్యాపారులు, కిరాయిదారులు బయటకు పరుగులు తీశారు. బిల్డింగ్ కింద దగ్గరలో ఉన్నవాళ్లు కూడా ప్రాణభయంతో దూరం పరుగెత్తారు.
ఈ బిల్డింగ్ ఎలక్ట్రానిక్ మార్కెట్‌కు చాలా ఫేమస్. అయితే అధికారిక తనిఖీలు ముగిసిన తర్వాతనే ఆ బిల్డింగ్‌ను తెరవనున్నట్లు బిల్డింగ్ ఓనర్లు చెప్పారు. షెంజెన్ ఎలక్ట్రానిక్స్ గ్రూపు పేరుతో ఆ బిల్డింగ్ నిర్మించారు. సెమీకండక్లర్లు, ఎలక్ట్రానిక వస్తువులు తయారు చేసే సంస్థలు ఈ బిల్డింగ్‌లో ఉన్నాయి. ప్రధాన బిల్డింగ్‌లో ఎటువంటి లోపాలు కనిపించలేదని నిపుణులు చెప్పారు. 2000 సంవత్సరంలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ బిల్డింగ్‌ను ప్రస్తుతం డ్రోన్లతో పరిశీలిస్తున్నారు. అధికారులు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే బిల్డింగ్‌ను మళ్లీ ఓపెన్ చేయనున్నారు.