ఢిల్లీలో నిర్మాణంలో ఉన్న భవనం ఈ తెల్లవారు జామున కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా ఆరుగరు కార్మికులకు తీవ్రగాయ్యాయి. భవనం కూలిన టైంలో అందులో కార్మికులు పనులు చేస్తున్నారు. పోలీసులు ఘటన స్థలికి చేరుకొని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది స్థానికుల సహాయంతో సహాయక చర్యలు కొనసాగించారు.
గాయపడిన వారిని స్థానిక జీటీబీ ఆస్పత్రికి తరలించగా.. అయితే, అర్షద్, తౌహీద్ లు చికిత్స పొందుతూ మరణించారు. రెహాన్, అరుణ్, నిర్మల్, జలధర్ లు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు.
ఇక, భవనం కూలిన టైంలో అందులో 13 మంది కార్మికులు పని చేస్తున్నారని డీసీపీ రాజేష్ డియో చెప్పారు. భవన నిర్మాణంకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్ తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, భవనం కూలిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కాగా, ఢిల్లీ అగ్నిమాపక శాఖ అధికారి అనుప్ మాట్లాడుతూ.. సమాచారం వచ్చిన వెంటనే అగ్నిమాపక సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వచ్చినట్లు పేర్కొన్నారు. వారు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు.. భవనం శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురు కూలీలను బయటకు తీసినట్లు పేర్కొన్నారు. గాయపడిన వారికి చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించామన్నారు.