గుజరాత్ అక్రమంగా లిక్కర్ అమ్ముతున్న వారి గుట్టు వింత రీతిలో రట్టు అయింది. మద్యం తాగిన గేదెలు, అక్రమ లిక్కర్ అమ్మకాలను అధికారులకు తెలియజేసేలా చేశాయి. ముగ్గురు రైతులు అక్రమంగా సారా అమ్ముతున్నారు. లిక్కర్ సీసాలను గేదెలు తాగే నీటి తొట్టిలో దాచారు. అయితే కొన్ని సీసాలు పగలడంతో సారా నీటిలో కలిసింది. ఈ నీటిని తాగిన గేదెలు వింతగా ప్రవర్తించాయి. గేదెల వింత ప్రవర్తనకు ఆందోళన చెందిన ఒక రైతు పశు వైద్యుడ్ని రప్పించాడు. గేదెలు తాగిన నీటి వాసన, రంగును పరిశీలించిన ఆ పశువైద్యుడు అందులో మద్యం కలిసినట్లు గుర్తించాడు. అక్రమ సారా అమ్మకాల గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో సోమవారం ఆ పశు శాలపై పోలీసులు రైడ్ చేశారు. అక్కడ రహస్యంగా దాచిన రూ.32,000 విలువైన వంద మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు రైతులను అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి: ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ గడువు పెంపు