కేంద్ర బడ్జెట్‌ను ‘కుర్చీని కాపాడుకునే బడ్జెట్’గా ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ అభివర్ణించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ (మంగళవారం) లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25పై లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ పెదవి విరిచారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను ‘కాపీ అండ్ పేస్ట్’ చేశారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బడ్జెట్‌లో మిత్రపక్షాలను సంతృప్తిపరిచారని, ఇతర రాష్ట్రాల ప్రయోజనాలను పక్కన పెట్టి మిత్రపక్షాలకు బూటకపు వాగ్దానాలు చేశారని రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు.
బడ్జెట్ ద్వారా మిత్రులను ఆనందింపజేశారని, ఏఏలకు (అంబానీ, అంబానీ అనే అర్థంతో) ప్రయోజనం చేకూర్చేందుకు సామాన్యులకు ఎలాంటి ఉపశమనం కల్పించలేదని విమర్శించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో, మునుపటి బడ్జెట్లలను ‘కాపీ అండ్ పేస్ట్’ అని విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.