Friday, November 22, 2024

Budget Session – లోక్‌స‌భ ప్రారంభం – 12 వ‌రకు జ‌ర‌గ‌నున్న స‌మావేశాలు

అమృత‌కాల బ‌డ్జెట్‌గా అభివ‌ర్ణించిన ప్ర‌ధాని మోదీ
2047 నాటికి విక‌సిత్ భార‌త్ పూర్తి చేస్తామ‌ని వెల్ల‌డి
స‌వాళ్ల‌ను ఎదుర్కొంటూ మున్ముందుకు
స‌భ‌లో మాట్లాడేందుకు అంద‌రికీ చాన్స్ ఇస్తాం
ఈ అయిదేండ్లు ప్ర‌గతి కోసం పోరాడాల‌ని స‌భ్యుల‌కు పిలుపు
వియాత్నాం నేత గుయోన్ ఫుట్రోంగ్‌కు నివాళి
కొత్త స‌భ్యుల ప్ర‌మాణ స్వీకారం
ప్ర‌శ్న‌లు అడ‌గ‌డం ప్రారంభించిన లోక్‌స‌భ సభ్యులు
నీట్​ పేపర్​ లీకేజీపై చర్చకు విపక్షాల పట్టు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – న్యూ డిల్లీ – కేంద్రంలో మూడోసారి అధికార పగ్గాలు చేపట్టిన ఎన్​డీఏ సర్కారు తొలిసారి బడ్జెట్‌ను సమర్పించేందుకు పార్లమెంటు సోమవారం సమావేశం అయ్యింది. ఈ బడ్జెట్​ సమావేశాలు ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. దివంగత వియత్నాం నాయకుడు గుయెన్ ఫు ట్రోంగ్(80)కు లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా నివాళులర్పించారు. బెంగాల్‌లోని అసన్‌సోల్‌ నియోజకవర్గం నుంచి గెలిచిన శత్రుఘ్న సిన్హా లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఇది అమృత కాలానికి చెందిన బడ్జెట్​ : ప్రధాని మోదీ

- Advertisement -

పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలకు ముందు ప్రధాని మోదీ మాట్లాడారు. ప్రస్తుత బడ్జెట్‌ను అమృత్‌ కాలానికి చెందిన బడ్జెట్‌గా అభివర్ణించారు. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ పూర్తి చేసే బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నామని అన్నారు. సవాళ్లను ఎదుర్కొంటు ముందుకెళ్తున్నామని, తమ ప్రభుత్వం దేశం కోసం పోరాడుతోందని తెలిపారు. సభలో మాట్లాడేందుకు వివిధ పార్టీల నుంచి వచ్చిన సభ్యులకు అవకాశం వస్తుందన్న ప్రధాని, ఐదేళ్లు ప్రగతి కోసం పోరాడాలని, తర్వాతే వచ్చే ఎన్నికల గురించి ఆలోచించాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement