Tuesday, November 26, 2024

Budget Aims – వికసిత భారత్.. 2047 టార్గెట్…సబ్కా సాత్, సబ్కా వికాస్


ఈ నినాదంతోనే ముందుకు వెళ్తున్నాం
అందరికీ అందుబాటులో అన్ని సదుపాయాలు
హర్ గర్ జల్, విద్యుత్, గ్యాస్, బ్యాంక్ అకౌంట్స్
పేదలు కడపునిండా తినేలా ఫ్రీ రేషన్ ఇస్తున్నాం
సోషల్ జస్టిస్ పేరుతో రాజకీయాలు చేయడం లేదు
11.8 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ యోజన
ఏషియన్ గేమ్స్ 2023, పారా గేమ్స్లో సత్తాచాటాం
జీడీపీ అంటే.. గవర్నెస్, డెవలప్మెంట్, ప్రోగ్రెస్
కొత్త అర్థం.. సరికొత్త భాష్యం చెప్పిన నిర్మలమ్మ

కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి మందు ఆర్థిక మంత్రి నిర్మలా రాష్ట్రపతి ముర్మును కలిశారు. బడ్జెట్ గురించి రాష్ట్రపతికి వివరించి, పార్లమెంట్కు చేరుకున్నారు. కేబినెట్ భేటీ అనంతరం లోక్సభలో అడుగుపెట్టారు.

ఇప్పటికే మధ్యంతర బడ్జెట్ 2024 తయారీలో కీలకపాత్ర పోషించిన అధికారులతో ఆర్థిక మంత్రి నిర్మలా ఫొటో దిగారు. అనంతరం ఆర్థిక శాఖ కార్యాలయం నుంచి బయలుదేరి వెళ్లి రాష్ర్టప్రతి ముర్మును కలిశారు.

రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సబ్కా సాత్, సబ్కా వికాస్ నినాదంతో ముందుకు వెళ్తున్నట్టు ఆర్థిక మంత్రి చెప్పారు.

హర్ గర్ జల్, విద్యుత్, గ్యాస్, బ్యాంకు అకౌంట్స్ అందరికీ అందుబాటులోకి తీసుకురావడం.. మరింత సదుపాయాలను ప్రజల చెంతకు తీసుకొచ్చామని, వీటిని అందించడంలో రికార్డు సృష్టించామని నిర్మలా చెప్పారు. ఫ్రీ రేషన్ అందిస్తున్నామని తెలిపారు. 2047 నాటికి వికసిత్ భారత్ దిశగా అడుగులు వేస్తున్నామని, సోషల్ జస్టిస్ పేరుతో రాజకీయాలు చేయడం లేదని అన్నారు.

పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద 11.8 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకురుస్తున్నాం. పీఎం ఫసల్ బీమా యోజన కూడా రైతులకు అందిస్తున్నాం

- Advertisement -

ఏషియన్ గేమ్స్ 2023, పారా గేమ్స్లో భారత క్రీడాకారులు సత్తా చాటారని ఆర్థిక మంత్రి నిర్మల అన్నారు. చెస్ క్రీడాకారుడు ప్రజ్ఞానందం గురించి కూడా నిర్మల ప్రసంగంలో ప్రస్తావించారు.

జీడీపీకి కొత్త అర్థం చెప్పారు నిర్మలా.. గవర్నెస్, డెవలప్మెంట్, ప్రోగ్రెస్ అని జీడీపీకి సరికొత్త భాష్యం చెప్పారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. కానీ, ఇండియా ఆర్థిక వ్యవస్థ మాత్రం బలంగా ఉందన్నారు. గ్లోబల్ సమస్యలకు ఇండియా పరిష్కారంగా కనిపిస్తోంది. ఆర్థిక వ్యవస్థ గేమ్ చేంజర్గా ఇండియా మారిందిని నిర్మలా అన్నారు.

2047 నాటికి ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని నిర్మలా అభిప్రాయపడ్డారు. వేగంగా, సమతుల్యతతో కూడిన అభివృద్ధి దేశంలో జరుగుతోందని అన్నారు.

పీఎం ఆవాస్ యోజన్ గ్రామీణ పథకంలో 3 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. 2 కోట్ల కొత్త ఇళ్లను నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు.

ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అందరు అంగన్వాడీ, ఆశ వర్కర్లకు కల్పిస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా చెప్పారు.

డెయిరీ రైతులకు ఎంతో చేస్తున్నామని అన్నారు. దేశంలోనే అతిపెద్ద పాల సరఫరాదారుగా డెయిరీ ఉందన్నారు. రాష్ట్రీయ గోకుల్ మిషన్ వంటి పథకాలు దీనికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన ద్వారా మత్స్యకారులకు ఎంతో లబ్ధి చేకూరుతోందన్నారు.

జై జవాన్, జై కిసాన్ నినాదాన్ని లాల్ బహదూర్ శాస్త్రి ఇస్తే.. అటల్ బిహారీ వాజ్పేయి దానికి జై విజ్ఞాన్గా చేశారన్నారు. ఇప్పుడు జై అనుసంధాన్ అనేది ప్రధాని మోదీ చేర్చారన్నారు.

మూడు రైల్వే కారిడార్ ప్రోగ్రామ్ చేపట్టామని, 40 వేల రైల్వే బోగీలను వందే భారత్ స్థాయికి తీసుకువచ్చామన్నారు. విమానయాన రంగంలో అద్భుత ప్రగతి సాధించినట్టు చెప్పారు.

టూరిజం అభివృద్ధికి కృషి చేస్తన్నామని, అధ్యాత్మిక టూరిజం డెవలప్మెంట్ చేస్తున్నామన్నారు. ఈ దిశగా కృషి చేయాలని రాష్ట్రాలకు సూచించారు. ఈ సందర్భంగా లక్షద్వీప్ని ప్రస్తావించారు.

టాక్స్ పేయర్స్ని అభినందించారు నిర్మలా. గతంలో 90 రోజులుగా ఉన్న ఇన్కమ్ టాక్స్ రిటర్న్ సమయాన్ని 10 రోజులకు తగ్గించినట్టు తెలిపారు.

ట్యాక్స్ రేట్లు యథావిధిగా ఉంటాయని ఆర్థిక మంత్రి నిర్మలా చెప్పారు. స్టార్టప్స్కి ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయన్నారు.

ఎన్నికల వేళ ప్రవేశపెడుతున్న మధ్యంతర బడ్జెట్ కాబట్టి మహిళలను ఆకట్టుకునేలా పలు ప్రకటనలు ఉంటాయనే ఆసక్తి అందరిలో కనిపించింది. మహిళా సాధికారత కోసం ప్రత్యేకంగా కేటాయింపులు, పథకాలు ఉండబోతున్నట్టు పరిశీలకులు ఆశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement