Friday, November 22, 2024

Union Budjet 2023 | కేంద్ర బడ్జెట్​తో వేటి ధరలు పెరిగాయి.. వేటికి తగ్గాయి?

కేంద్ర ఆర్థికశాఖమంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రభుత్వం కొన్నింటిపై దిగుమతి సుంకాల రాయితీ కల్పించింది. మరి కొన్నింటిపై భారం వేయడంతో కీలక వస్తువుల ధరల్లో మార్పులు రానున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన 2023 బడ్జెట్‌లో కొన్ని వస్తువుల ధరలు పెరిగాయి..మరి కొన్ని వస్తువుల ధరలు తగ్గాయి.

ధ‌ర‌లు పెరిగేవి: బంగారం,ప్లాటినంతో తయారైన వస్తువులు, సిగరెట్లు, టైర్లు, ఇమిటేషన్‌ జ్వువల్లెరీ, వెండిపై దిగుమతి సుంకాన్ని పెంచడంతో వీటి ధర పెరగనుంది. దిగుమతి చేసుకున్న ఎలక్ట్రానిక్‌ కిచెన్‌ చిమ్నీ, రాగి తుక్కు, రబ్బర్‌, దిగుమతి చేసుకున్న సైకిళ్లు, ఆటవస్తువులు, ఎలక్ట్రానిక్‌ వాహనాల ధరలు పెరగనున్నాయి.

ధరలు తగ్గిన ఉత్పత్తులు:
మొబైల్‌ ఫోన్ల పరికరాలు, కెమెరా లెన్సుల కస్టమ్స్‌ సుంకంపై ఏడాది పాలు మినహాయింపు, డైమండ్‌ తయారీ వస్తువులు, టీవీ ప్యానెల్‌ విడిభాగాలపై ప్రస్తుతం ఉన్న 5 శాతం కస్టమ్స్‌ సుంకాన్ని 2.5 శాతానికి తగ్గించారు. దీంతో వీటి ధరలు తగ్గే అవకాశం ఉంది. లిథియం ఆయాన్‌ బ్యాటరీలకు అవసరమైన సామాగ్రిపైన కస్టమ్స్‌ సుంకాన్ని మినహాయించారు. రోయ్యల ఆహార ఉత్పత్తుల దిగుమతిపై కస్టమ్స్‌ డ్యూటీ తగ్గించారు. ఫలితంగా దేశీయంగా తయారు చేసే వాటి ధరలు తగ్గుతాయి. ఈవీ పరిశ్రమకు చెందిన ముడి వస్తువుల ధరలు కూడా తగ్గనున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా బడ్జెట్‌ 2023 ఎంతో ప్రముఖ్యత సంతరించుకుంది. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ప్రారంభమైయాయి.

- Advertisement -

ఈ ఆ తర్వాత 2022-23 ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. వచ్చే ఆర్థిక సంవత్సరం(2023-24) వార్షిక బడ్జెట్‌ను సిద్ధం చేయడానికి అధికారిక కసరత్తు అక్టోబర్‌ 10న ప్రారంభమైంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2023-24లో భారత జీడీపీ 6 నుంచి 6.8 శాతం వరకు పెరుగుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. కొవిడ్‌ మహమ్మారి నుంచి భారతదేశం ఆర్థికంగా కోలుకోవడం పూర్తయిందని, 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ 6 శాతం నుంచి 6.8 శాతం వరకు వృద్ధి చెందుతుందని ఆర్థిక సర్వే పేర్కొంది. ఇది ఈ ఆర్థిక సంవత్సరం 7 శాతం, 2021-22లో8.7 శాతంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement