యాచారం, ప్రభన్యూస్ : యాచారం మండలంలో బీఎస్‌ఎన్ ఎల్ సేవలు రెండు రోజులుగా మొరాయిుస్తున్నాయి. యాచారం మండల కేంద్రంలో గతంలో కూడ పలుమార్లు బిఎస్‌ఎన్‌ఎల్ సేవలు మోరాయించడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక ఇంటర్‌నెట్ సేవలను ఉపయోగించే వారి కష్టాలు అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. వారు ముందుగానే బిల్లులు చెల్లించారు. కానీ సేవలు మోరాయించినప్పుడల్లా వినియోగదారులకు కష్టాలు అధికమవుతున్నాయి. ఇవన్ని తెలిసిన అధికారులు మాత్రం చూసిచూడనట్లు వ్యహరిస్తున్నారు.
గత మూడు రోజుల నుండి విద్యుత్ అంతరాయం ఏర్పాడటంతో జనరేటర్‌లు పెట్టి నడిపించిన ఫలితం మాత్రం లేదు. ఒకప్పుడు దేశంలోనే అగ్రగామిగా నిలిచిన బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ నేడు పూర్తిగా వెనుకబడి పోయింది. ప్రైవేటు సంస్థలను దీటుగా ఎదుర్కోన్న బిఎస్‌ఎన్ ఎల్ సంస్థ నేడు వినియోగదారులకు సేవలను అందించడంలో పూర్తిగా విఫలమైంది. కావున సంబంధిత శాఖ అధికారులు కల్పించుకోని మరోసారి బిఎస్ ఎన్‌ఎల్ సేవలు మోరాయించకుండా వినియోగదారులకు సరియైన సేవలను అందించాలని యాచారం పట్టణ ప్రజలు కోరుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..