Monday, November 18, 2024

2024లో బిఎస్‌ఎన్‌ఎల్‌ 5జీ సేవలు

ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్‌ 5జీసేవలను 2024లో ప్రారంభించబోతున్నదని కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ తెలిపారు. ఒడిశాలో జి యో, ఎయిర్‌టెల్‌ 5జీ సేవలను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌తో కలిసి గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, బిఎస్‌ఎన్‌ఎల్‌ 5జీ సేవల అంశంపై స్పందించారు. వచ్చే ఏడాది సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. భువనేశ్వర్‌, కటక్‌ నగరాల్లో ప్రస్తుతం జియో, ఎయిర్‌టెల్‌ 5జీ సేవలు ప్రారంభం అయ్యాయని, రాబోయే రెండేళ్లలో ఒడిశా అంతటా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు.

గ్రామీణ ప్రాంతాల్లో టెలికాం సేవలు అందించేందుకు 4జీ టవర్లు 100 ప్రారంభించినట్లు చెప్పారు. బిఎస్‌ఎస్‌ఎన్‌ఎల్‌ 5జీ సేవల కోసం ఇప్పటికే టిసిఎస్‌, సి-డాట్‌తో కూడిన కన్సార్టియాన్ని షార్ట్‌ లిస్ట్‌ చేసింది. ఈ ఒప్పందం ప్రకారం ఏడాదిలో నెట్‌వర్క్‌ను 5జీకి అప్‌గ్రేడ్‌ చేయాల్సి ఉంటుంది. ఇందుకు సుమారు ఏడాది సమయం పడుతుందని అంచనా.

Advertisement

తాజా వార్తలు

Advertisement