Saturday, November 23, 2024

BSI సర్టిఫికేషన్ పొందిన నథింగ్ ఫోన్ సెకండ్ ఎడిషన్..

గత సంవత్సరం స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ఎంట్రీ ఇచ్చింది నథింగ్ ఫోన్ (1). అనుకున్నంత పెద్దగా అయితే ఈ ఫోన్ హిట్ కాలేదు. అయితే, ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ కంపెనీ నథింగ్ ఫోన్ నెక్స్ట్ ఎడిషన్‌ను ప్రారంభించాలని చూస్తుంది. నథింగ్ నుంచి రెండో స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్ (2) త్వరలో భారత్‌లో విడుదల కానుంది. దీనికి సంబంధించి, నథింగ్ ఫోన్ (2)కి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సర్టిఫికేషన్ వచ్చింది. నథింగ్ ఫోన్ (2) నథింగ్ ఫోన్ (1) కంటే ఎక్కువ ప్రీమియమ్‌గా ఉండనుంది. అయితే ఫోన్ స్పెసిఫికేషన్స్ ఏవీ ఇంకా లిస్టింగ్‌లో వెల్లడించలేదు కంపెనీ.

కాగా, భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుందనేది ప్రస్తుతానికి అయితే తెలియదు. నథింగ్ ఫోన్ (2) క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 సిరీస్ చిప్‌సెట్ ద్వారా అందించబడుతుందని. MWC 2023లో నథింగ్ CEO కార్ల్ పీ ప్రకటించారు. నథింగ్ ఫోన్ (2), అసలు నథింగ్ స్మార్ట్‌ఫోన్ కంటే “ఎక్కువ ప్రీమియం”గా ఉంటుంది. అలాగే, ఈ ఏడాది చివర్లో ఈ డివైజ్ అమెరికాలో అందుబాటులోకి వస్తుందని కార్ల్ పీ పేర్కొన్నారు.

నథింగ్ ఫోన్ (2) స్పెసిఫికేషన్‌లు, ధర ఇతర వివరాలు :

నథింగ్ ఫోన్ 2 6.5-అంగుళాల FHD+ AMOLED స్క్రీన్‌తో 120 Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతునిస్తుందని పుకారు వచ్చింది. స్మార్ట్‌ఫోన్‌లో 5000 mAh బ్యాటరీ, వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా ఉండవచ్చు. ఫోన్ Qualcomm Snapdragon ప్రాసెసర్‌తో వస్తుంది. బహుశా 5G కనెక్టివిటీతో డ్యూయల్ సిమ్ సపోర్ట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, USB టైప్-సి ఛార్జింగ్, GPS, NFC, Wi-Fi మరియు మరిన్నింటిని కలిగి ఉండవచ్చు. నథింగ్ ఫోన్ 2 ప్రారంభ ధర రూ.35,000 కంటే ఎక్కువగా ఉండవచ్చని అంచనా. భారతదేశంలో ప్రారంభించినప్పుడు నథింగ్ ఫోన్ (1) ప్రారంభ ధర రూ.32,999.

Advertisement

తాజా వార్తలు

Advertisement