Tuesday, November 26, 2024

Brutally assaulted – అప్పు చెల్లించ‌లేద‌ని మ‌హిళ‌ను వివ‌స్త్ర‌ను చేసి, క‌ర్ర‌ల‌తో చిత‌క బాది…ఆ పై మూత్రం పోసి..

పట్నా, : బీహార్‌లోని పట్నాలో రూ.1500 అప్పు చెల్లించలేదని ఈ దళిత మహిళను అగ్రకులస్థులు దారుణంగా అవమానించారు. అందరు చూస్తుండగానే ఆమెను వివస్త్రను చేసి కర్రలతో చితకబాదారు. అనంతరం ఆమెతో బలవంతంగా మూత్రం తాగించారు. ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో బాధిత మహిళ ప్రాణాలతో పోరాడుతోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బీహార్‌లోని పట్నాకు చెందిన ఓ మహిళ కొన్ని నెలల క్రితం ప్రమోద్ సింగ్ నుంచి వడ్డీకి రూ.9000 అప్పుగా తీసుకుంది. అయితే ఆ మొత్తం నగదును వడ్డీతో సహా తిరిగి చెల్లించింది. అయినప్పటికీ ప్రమోద్‌ సింగ్‌ అదనంగా రూ.1500 డబ్బు చెల్లించాలని మహిళను డిమాండ్‌ చేశాడు. అందుకు ఆమె నిరాకరించింది. ఎక్కువ డబ్బులు ఇవ్వకుంటే వివస్త్రను చేసి ఊరంతా ఊరేగిస్తానని ప్రమోద్ సింగ్‌ మహిళను పలుమార్లు బెదిరించాడు. ఈ బెదిరింపులపై మహిళ గతంలో పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో రెచ్చిపోయిన నిందితుడు ప్రమోద్‌ సింగ్‌, అతని కుమారుడు అన్షు, మరో నలుగురు సహచరులతో కలిసి శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో దళిత మహిళ ఇంటికి వెళ్లి బలవంతంగా ఆమెను ఇంటి నుంచి బయటకు లక్కొచ్చారు. ఆమెపై దారుణంగా దాడి చేసి వివస్త్రను చేసి, కర్రలతో తీవ్రంగా కొట్టారు. అనంతరం నిందితుడు ప్రమోద్ సింగ్ మహిళ నోటిలో మూత్ర విసర్జన చేయాలని తన కుమారుడు అన్షుకి పురమాయించాడు.

ఇంతలో బాధితురాలు వారి చెర నుంచి తప్పించుకుని పోలీస్‌ స్టేషన్‌కు పరుగు తీసింది. ఈ ఘటనలో మహిళ తలకు బలమైన గాయాలు కాగా కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అనంతరం బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రస్తుతం ప్రధాన నిందితుడితోపాటు అతని కుమారుడు, సహకరించిన నలుగురూ పరారీలో ఉన్నట్లు డీఎస్పీ ఫతుహా ఎస్ యాదవ్ తెలిపారు. బీజేపీ అధికార ప్రతినిధి యోగేంద్ర పాశ్వాన్ ఈ ఘటనను ఖండించారు. ఘటనపై ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌లపై మండిపడ్డారు. నిందితుల‌పై క‌ఠిన చ‌ర్య‌ల‌కు ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement