Thursday, January 16, 2025

Brutality – కోడలిని చంపి ఇంట్లోనే పూడ్చి వేత

మహబూబాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : కలకాలం తోడుంటానని మనవాడిన భర్తే ఆమె పాలిట యముడయ్యాడు. అగ్ని సాక్షిగా చేసిన బాసలు మరిచి తల్లిదండ్రులతో కలిసి భార్యను కిరాతకంగా హతమార్చారు. ఇంట్లోనే పూడ్చి పెట్టారు. ఈ విషాదకర సంఘటన మహబూబాద్‌ లోని సిగ్నల్‌ కాలనీలో చోటు చేసుకుంది.

స్థానికుల ఫిర్యాదు మేర‌కు…

మహబూబాబాద్ పట్టణం సిగ్నల్ కాలనీలోని ఓ ఇంటి ఆవరణలో వివాహితను హత మార్చి గొయ్యి తీసి పూడ్చి పెట్టారు అత్త కాటి లక్ష్మి, మామ రాములు , ఆడపడుచు దుర్గ , ఆడపడుచు భర్త మహేందర్, భర్త గోపి . భర్త, అత్త, మామ, ఆడపడుచు. ఇక అంత‌టితో ఆగ‌కుండా శవాన్ని పూడ్చిన బొందపై కట్టెల పొయ్యి పెట్టి పిండి వంటలు చేసుకున్నారు.. హత్య చేసిన అనంతరం ఇంటికి తాళం వేసి భర్తతో పాటు అత్త, మామ, ఆడపడుచు పరారయ్యారు. స్థానికుల ఫిర్యాదుతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పాతిపెట్టిన చోట తవ్వగా వివాహిత మృతదేహం బయటపడింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement