తిమ్మాపూర్, (ప్రభ న్యూస్) : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని జోగయ్యపల్లె హనుమాన్ ఆలయం ఆశ్రమ నిర్వాహకుడు చిలుపూరి పెద్దన్న స్వామి (60) హత్యకు గురయ్యాడు. ఎస్సై ఎస్సై ప్రమోద్ రెడ్డి తెలిపిన ప్రకారం.. స్వామి ఎన్నో సంవత్సరాల క్రితం హనుమాన్ దేవాలయాన్ని నిర్మించి అందులోనే ఆశ్రమం ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచి నిత్యం భక్తులు స్వామిని కలిసి సమస్యలు చెప్పి పరిష్కరించుకుంటారు. వరంగల్ జిల్లాకు చెందిన శివ పది రోజుల క్రితం తమ ఇంటి సమస్య ఉందని, స్వామి వచ్చి పరిశీలించి పరిష్కరించాలని కోరారు.
ఈ క్రమంలో పది రోజుల క్రితం వరంగల్ జిల్లాకు పెద్దన్న స్వామి వెళ్లి వచ్చాడు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం శివ తన స్నేహితుడు నీలం శ్రీనివాసు ఆశ్రమానికి వచ్చి కరీంనగర్లో పని ఉందని ఆశ్రమంలో తలదొచుకుంటామని చెప్పగా.. స్వామి ఒప్పుకున్నాడు. స్వామి అతని డ్రైవర్ సతీష్ తో కలిసి ఆదివారం ఉదయం బయటికి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చారు. స్వామి ఆ ఇద్దరిని ఇంకా వెళ్లలేదని అడుగగా ఉదయం వెళ్తామని సమాధానం ఇచ్చారు. ఇందుకు స్వామి ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో ఉదయం స్వామి అల్లుడు సతీష్ ఆలయం శుభ్రం చేయడానికి వెళ్లాడు.
అతని గదిలోకి వెళ్లి పిలువగా లేవకపోవడంతో భయంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా స్వామి చనిపోయి ఉన్నాడు. రాత్రి స్వామి ఆశ్రమంలో పడుకున్న గదిలోకి ఆ ఇద్దరు వ్యక్తులు వెళ్లి గొంతుపై తాడుతో బలంగా లాగి చంపినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సంఘటనా స్థలాన్ని కరీంనగర్ ఏసీపీ కర్ణాకర్ రావు, సీఐ శశిధర్ రెడ్డి, ఎస్ఐ ప్రమోద్ రెడ్డి సందర్శించారు. నిందితుల కోసం వరంగల్ కు ఒక ప్రత్యేక టీమును పంపినట్లు ఏసీపీ, సీఐ తెలిపారు. మృతడి కుమారుడు చిలుపూరి ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.