Monday, December 2, 2024

Murder : ప్రొద్దుటూరులో రౌడీషీట‌ర్ దారుణ హత్య..!

ప్రొద్దుటూరు, డిసెంబర్ 2(ఆంధ్రప్రభ): వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని బి.జి.ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ లోని రూం నెంబర్ 206లో ఆదివారం రాత్రి కొప్పుల రాఘవేంద్ర ఆలయాస్ పప్పీ (30) అనే యువకుడు దారుణహత్య గురయ్యారు. పోలీసులు రంగప్రవేశం చేసి వివరాలు సేకరిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం యనమల లోకేష్ రెడ్డి పేరుతో లాడ్జ్ లో రూమ్ బుక్ చేశారు. మరి కొంత మంది యువకులు కలిసి బార్ లో ఒక రూము తీసుకున్నారు. అందరూ కలిసి బాగా మద్యం సేవించి ఎంజాయ్ చేసినట్లు సిబ్బంది తెలిపారు. అయితే అప్పుడప్పుడూ వారు కేకలు వేస్తూ కొట్టుకోవడం తెలియవచ్చింది.

అంతలో కొప్పుల రాఘవేంద్ర మరికొందరు ఇళ్లకు వెళ్లిపోయారు. ఆ తర్వాత రాత్రి 9:30 గంటల సమయంలో తిరిగి కొప్పుల రాఘవేంద్ర లాడ్జి కి రావడం జరిగింది. అప్పటికి కూడా బాగా మద్యం సేవించి అందరూ ఒకరికొకరు గొడవపడుతూ వచ్చారు. మీరంతా మామూలుగా సరదాగా గొడవ పడుతున్నారని ఎవరికి వారిపై అనుమానం రాలేదన్నారు. తెల్లవారి చూసేసరికి రాఘవేంద్ర ముఖంపై మద్యం సీసాలతో గాయపరిచారు. ముఖంపై సీసా ఘాట్లు కనిపించాయి.

అతను అప్పటికే మృతి చెందారని సిబ్బంది పేర్కొంటున్నారు.ఈ మేరకు ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు .డాగ్స్ స్క్వాడ్ క్లూస్ టీం రానున్నారని పోలీసులు పేర్కొంటున్నారు. ఏ విధంగా ఈ హత్య జరిగిందని వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కొంత సమయానికి పూర్తి వివరాలు తెలియవచ్చునని పోలీసులు పేర్కొంటున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement