హర్యాణలో డీఎస్పీని మైనింగ్ మాఫియా హత్య చేసిన ఘటన లాంటిదే ఝూర్ఖండ్‌లోనూ చోటు చేసుకుంది. వాహనాలు తనిఖీ చేస్తున్న మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్‌ను దుండగులు వ్యాన్‌తో తొక్కించి హత్య చేశారు. రాంచీలో బుధవారం నాడు తెల్లవారుజామున ఈ దారుణం జరిగింది. సబ్ ఇన్‌స్పెక్టర్ గా పని చేస్తున్న సంధ్య తోప్నో రాంచీలోని తుపుడనా ఓపీ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున ఈ ప్రాంతంలో పిక్ ఆప్ వ్యాన్‌లో అనుమానాస్పద వస్తువులు రవాణా చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది.
తనిఖీలకు వెళ్లిన ఎస్‌ఐ వ్యాన్‌ను ఆపాలని కోరారు. డ్రైవర్ మాత్రం వ్యాన్‌ను ఆపకుండా ఆమెపై నుంచి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సంధ్య అక్కడిక్కడే మృతి చెందారు. ఈ సంఘటనలో ఒక అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనంలో పశువుల అక్రమ రవాణా జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతోనే తనిఖీలకు వెళ్లినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.