Wednesday, November 20, 2024

26న మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ పార్టీ వడివడిగా అడుగులు వేస్తోంది. పార్టీ విస్తరించేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. 26న కాందార్‌ లోహలో భారీ బహిరంగ సభను నిర్వహించబోతుంది. ఈ సభకు సీఎం కేసీఆర్‌ హాజరుకాబోతున్నారు. గులాబీ బాస్‌ సమక్షంలో పెద్ద ఎత్తున పార్టీలో చేరకలు ఉండనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. దాదాపు లక్ష మందికి పైగా జనం సభకు తరలిరానున్నట్లుగా తెలుస్తోంది.

కాందార్‌ లోహలోని బైల్‌ బజార్‌ మైదానంలో సభాస్థలి ఏర్పాట్లను ఆ పార్టీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి, టీఎస్‌ఐఐసీ ఛైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, నాందేడ్‌ జిల్లా ఎస్పీ సాయి కృష్ణ కొకటే పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ కిసాన్‌ సెల్‌ అధ్యక్షులు మాణిక్యం కదంతో పాటు నాందేడ్‌ జిల్లా నేతలు పాల్గొన్నారు.

స్థానికుల నుంచి స్పందన..

మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ పార్టీకి స్థానికుల నుంచి మద్దతు పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు బీఆర్‌ఎస్‌ వైపు చూస్తున్నట్లుగా అక్కడి నేతలు తెలుపుతున్నారు. అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ అంటూ నినాదాలు చేశారు. రేపు జరగబోయే సభను విజయవంతం చేయాలంటూ స్థానికులు అక్కడి ప్రజలను కోరుతున్నారు. సభకు సంబంధించి ఫర్బాని జిల్లాలోని పలు గ్రామాల్లో బీఆర్‌ఎస్‌ మహారాష్ట్ర శాఖ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది.

- Advertisement -

పెద్ద ఎత్తున బహిరంగ సభకు హాజరై సక్సెస్‌ చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలను స్థానిక మహారాష్ట్ర ప్రజలకు అక్కడి నేతలు వివరిస్తున్నారు. లక్షమందికి పైగా జనంతో సీఎం కేసీఆర్‌ హాజరుకాబోయే సభను విజయవంతం చేస్తామని మహారాష్ట్ర కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు మానిక్‌ రావు ఖదం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement