హైదరాబాద్, ఆంధ్రప్రభ: శతాబ్దాల కాలం ఒడిలో మరాఠ్వాడాకు తెలంగాణ స్నేహాన్ని బీఆర్‌ఎస్ పునరుద్ధరిస్తూ అభివృద్ధి అంశంగా మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ జెండా పాతుతోంది. భారతదేశ చరిత్రలో చిర్మరణీయంగా నిలిచిన మరాఠ్వాడా యోధుడు ఛత్రపతిశివాజీ గోల్కొండ కోటలో కొద్ది రోజులు గడిపి పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం చరిత్రపుటల్లో చెక్కుచెదరక నిలిచిన ఆదారాలు. అయితే నాడు గోల్కొండరాజులతో అభివృద్ధి అంశంపై సుధీర్ఘంగా చర్చించడంతో పాటుగా హైదరాబాద్ నుంచి తన సైనిక బలగంతో శ్రీశైలం వెళ్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు.అయితే కాలగమనంలో తిరిగి మహారాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కేసీఆర్ బీఆర్‌ఎస్ ను విస్తరిస్తున్నారు. శతాబ్దాల స్నేహం అనంతరం కూడా తెలంగాణ భూభాగంలో మహారాష్ట్ర కు చెందిన జిల్లాలు 1956 వరకు ఉన్నాయి.
భాషాప్రాతిపాదిక కుట్రలో భాగంగా తెలంగాణకు చెందిన నాందేడ్, ఉస్మానాబాద్, ఔరంగాబాద్, బీడ్, పర్భిణి మహారాష్ట్రలో కలిపారు. అయితే ఆంధ్రలో బలవంతంగా తెలంగాణను విలీనం చేసినట్లు తెలంగాణ భూభాగాలను బలవంతంగా మహారాష్ట్రలో విలీనం చేయడంతో అక్కడి ప్రజలు తెలంగాణలోకి తిరిగి రావాలని నాటి నుంచి నేటికి కోరుకుంటూనే ఉన్నారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఏడారులుగా ఉన్న తెలంగాణ భూముల్లొకి సీఎం కేసీఆర్ గోదావరి జలాలను తరలించడంతోపాటు వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వడంతో దేశానికి ఆహారం అందించే స్థాయిలో తెలంగాణ అభివృద్ధి దూసుకుపోతోంది.
అభివృద్ధి, సంక్షేమం నమూనాను మహారాష్ట్ర కు పరిచయం చేసేందుకు ఆబ్ కి బార్ కిసాన్ సర్కార్ నినాదంతో మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ స్థాపించి బహిరంగ సభలు నిర్వహిస్తుండటంతో మరాఠ్వాడాకు చెందిన జిల్లాలకు జిల్లాలు కేసీఆర్ కు పక్షాన నిలుస్తున్నాయి. . ఎన్ సీపీ,శివసేనా, కాంగ్రెస్, ఆఫ్ పార్టీల నాయకులు, కార్యకర్తలతో పాటుగా అనేక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు బీఆర్‌ఎస్ లోకి వలసలు వస్తుండటంతో మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ పట్టు బిగిస్తోంది. దశాబ్దాల స్నేహానికి గుర్తుగా మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ ఆధరణ అధికమవుతోంది.
ఇదిలా ఉండగా గోల్కొండ చివరి రాజు అబుల్ హసన్ తానీషా పట్టాభిషేకానికి ఛత్రపతి శివాజీ 1672లో రావడంతో పాటుగా తెలంగాణ భూభాగాలపై ఉన్న అభిమానంతో తానీషాతో స్నేహం పెంచుకుని 1677లో 30 వేల అశ్వబలం, 40ఒంటెల కాల్భలంతో హైదరాబాద్ లో సుమారు నెలరోజుల పాటు శివాజీ ఉన్నారు. నాటి నుంచి ఆసఫ్ జాహీల వరకు మహారాష్ట్రలోని 5 జిల్లాలు తెలంగాణలో అంతర్భాగంగానే ఉన్నాయి. ఇటీవల ఛత్రపతి శివాజీ 13వ తరం వారసుడు ఛత్రపతి శంభాజీరాజే హైదరాబాద్ లో సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలవడంతో మహారాష్ట్రతో తెలంగాణకు ఉన్న రోటీ బంధం మరింత బలోపేతం అయ్యింది.
మహారాష్ట్ర సోలాపూర్ లో ఈ నెలలో బహిరంగ సభనిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బాల్ కోట్, ఈద్గా మైదానాలను బహిరంగ సభకోసం పరిశీలిస్తున్నారు. అలాగే మహారాష్ట్ర లోని 36 జిల్లాల్లో కమిటీలు వేయడంతో పాటుగా లక్షలాది మంది పదాధి కారులను పార్టీ దృష్టి సారించింది. ఇటీవల ఈ మైదానాలను రాష్ట్ర మంత్రి హరీష్ రావు పరిశీలించి స్థానిక నాయకులకు బాధ్యతలు అప్పగించారు. ప్రధానంగా వ్యవసాయం, సాగునీటి రంగాభివృద్ధి లక్ష్యంగా మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ ప్రజల్లోకి వెళ్లుతోంది.
మహారాష్ట్రలో కృష్ణా,గోదావరి, తపతి, నర్మద, మూస గోదావరితో పాటు ఇంద్రావతి, వార్దా, వైగంగా, సర్వరానది, పూర్ణనది, శబరి తో పాటు అనేక ఉపనదులున్నప్పటికీ తాగేందుకు నీరు కరువు ఎందుకు ఉందని బీఆర్‌ఎస్ మహారాష్ట్ర ప్రజా క్షేత్రంలో ప్రశ్నిస్తోంది. దక్కన్ పీఠభూమిలో అధికంగా మహారాష్ట్రలో ఉన్నప్పటికీ సాగునీరు కరువైన ప్రాంతాలు ఎందుకున్నాయని బీఆర్‌ఎస్ ప్రశ్నిస్తూ ఆబ్ కి బార్ కిసాన్ సర్కార్ పేరుతో పట్టు బిగిస్తోంది. రాబోయో సాధారణ ఎన్నికల్లో 288 నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ పోటీకి సిద్ధమైంది. ఈ మేరకు మహారాష్ట్ర ప్రజలు బీఆర్‌ఎస్ ను స్వాగతిస్తున్నారు. ఇప్పటికే నాందేడ్ జిల్లాలోని నల్గావ్, భోకర్, డెగ్లూర్, కిన్వాట్, హత్ గావ్ అసెంబ్లిd నియోజకవర్గాలను తెలంగాణలో విలీనం చేయాలని ప్రజలు ఆందోళన బాట పట్టారు. అయితే శతాబ్దాల మరాఠ్వాడా స్నేహం బీఆర్‌ఎస్ కు మద్దతుగా నిలవడంతో పాటు అభివృద్ధి లక్ష్యంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లుతున్న సీఎం కేసీఆర్ కు లక్షలాది మంది ప్రజలు హారతులు పట్టి ఆహ్వానిస్తున్నారు.
సోలాపూర్ బహిరంగ సభ తేదీని ప్రకటిస్తాం : మహారాష్ట్ర బీఆర్‌ఎస్ పార్టీ ఇన్ ఛార్జీ కల్వకుంట్ల వంశీధర్ రావు
సోలాపూర్ బహింరంగ సభ తేదీ, వివరాలు త్వరలో ప్రకటించనున్నట్లు బీఆర్‌ఎస్ మహారాష్ట్ర ఇన్ఛార్జీ వంశీధర్ రావు ఆంధ్రప్రభకు తెలిపారు. తెంగాణఅభివృద్ధిని దేశంలోని అన్ని రాష్ట్రాలు కోరుకుంటున్నాయన్నారు. ప్రధానంగా మహారాష్ట్రలో సాగునీరు, తాగునీటి సమస్య పరిష్కారం కావాలంటే బీఆర్‌ఎస్ ద్వారనే సాధ్యమని ఆంధ్ర ప్రభ అడిగితే ఆయన బదులిచ్చారు. అలాగే మహారాష్ట్రలో పార్టీ దూసుకుపోతుందన్నారు. ఎన్నికల ఏజెండాకు సంబంధించిన అంశాలను ప్రస్థావించగా త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.