బీజేపీని వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రులు, ప్రాంతీయ పార్టీల నేతలను ఆహ్వానించి కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీయేతర పార్టీల బలం నిరూపించే విధంగా హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ ప్లీనరీని నిర్వహించాలని బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు యోచిస్తున్నారు. టీఆర్‌ఎస్ నుంచి బీఆర్‌ఎస్‌గా మారిన తరువాత రాష్ట్రంలో జరుగుతున్న తొలి ప్లీనరీ సమావేశం ఇదే.
పార్టీ ప్లీనరీకి బీజేపీయేతర జాతీయ, ప్రాంతీయ నాయకులు, అలాగే నగరంలో వారితో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. దానికి తమిళనాడు సీఎం ఎంకే.స్టాలిన్ తో పాటు.. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బీహార్ సీఎం నితీశ్ కుమార్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేరళ సీఎం పినరయి విజయన్ లను ఆహ్వానించాలని సీఎం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.