బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో కరీంనగర్ పోలీసులు అయన్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా, పోలీసులు కౌశిక్ రెడ్డిని కరీంనగర్ వన్ టౌన్ పీస్ కు తరలించనున్నారు.
ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, కౌశిక్ రెడ్డిల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. సంజయ్ పై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వాగ్వాదానికి కారణమయ్యాయి. తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే ఈ గొడవ జరిగింది.