Friday, November 22, 2024

సభ్యత్వం పోయింది.. ఆహ్వానం మిగిలింది

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పార్లమెంటు- సమావేశాల అజెండాను ఖరారు చేసే బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ-(బీఏసీ)లో భారత రాష్ట్ర సమితి చోటు- కోల్పోయింది. కనీసం ఆరుగురు ఎంపీలున్న రాజకీయ పార్టీకి బీఏసీలో సభ్యత్వం ఉంటు-ంది. ఆ మేరకు సభ్యత్వం కల్గిన ప్రతి పార్టీ ఫ్లోర్ లీడర్‌కు సమావేశం ఏర్పాటు- చేసినప్పుడు లోక్‌సభ సచివాలయం ఆహ్వానం పంపుతుంది. అయితే తాజాగా బీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర రావుకు పంపిన ఆహ్వానంలో ప్రత్యేక ఆహ్వానితులుగా లోక్‌సభ సచివాలయం పేర్కొంది. దీంతో బీఏసీ నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీని తొలగించినట్టు-గా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. దీనిపై లోక్‌సభ సచివాలయం నుంచి కూడా ఎలాంటి వివరణ రాలేదు. సాధారణంగా ఆరుగురు కంటే ఎక్కువ సభ్యులున్న రాజకీయ పార్టీకి బీఏసీలో సభ్యత్వం కల్పిస్తారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి లోక్‌సభలో 9 మంది ఎంపీలున్నాయి. అయినప్పటికీ సభ్యత్వం కల్గిన పార్టీలా కాకుండా ప్రత్యేక ఆహ్వానితులుగా పేర్కొనడంపై బీఆర్‌ఎస్‌ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.


తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చడం కోసం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరగా.. గత ఏడాది ఈసీ అందుకు ఆమోదం తెలిపింది. అప్పటి నుంచి పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)గా వ్యవహరిస్తోంది. ఢిల్లీలోనూ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించింది. పార్లమెంటు- ఉభయ సభల్లో టీ-ఆర్‌ఎస్‌ పేరును ఇక నుంచి బీఆర్‌ఎస్‌గా వ్యవహరించాలంటూ దరఖాస్తు కూడా సమర్పించారు. దీనిపై అటు- లోక్‌సభ స్పీకర్‌, ఇటు- రాజ్యసభ ఛైర్మన్‌ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈలోగా బీఏసీ సమావేశానికి ఆహ్వానం పంపే విషయంలో లోక్‌సభ సచివాలయం సభ్యత్వం నుంచి ఆహ్వానితుల జాబితాలో మార్చడం ఆశ్చర్యాన్ని కల్గిస్తోంది. దీని వెనుక రాజకీయ కారణాలున్నాయా లేక సాంకేతిక కారణాలతో ఇలా జరిగిందా అన్న విషయంపై స్పష్టత లేదు. మారిన పార్టీ పేరును గుర్తించే క్రమంలో ఇలా జరిగి ఉండవచ్చని కొందరు అధికారులు పేర్కొన్నారు. అయితే అధికారికంగా లోక్‌సభ సచివాలయం నుంచి మాత్రం ఎలాంటి వివరణ రాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement