తెలంగాణ భవన్‌లో రేపు (మంగళవారం) మధ్యాహ్నం బీఆర్‌ఎస్ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ కానున్నారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమవేశంలో చర్చిస్తారు.
అసెంబ్లీలో ఉద్యోగ క్యాలెండర్, నిరుద్యోగ సమస్యలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ వైఫల్యంపై ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రశ్నించనుంది. అదేవిధంగా చేనేత కార్మికుల ఆత్మహత్యలపై….. ఆరు గ్యారెంటీలు, రైతు రుణమాఫీ, ఫీజు రీయింబర్సుమెంట్స్, పారిశుద్ధ్యంపై అసెంబ్లీలో బీఆర్ఎస్ చర్చించనుంది.