ఎన్నికల అఫిడివిట్ లో తప్పుడు సమాచారం అభియోగాలతో తెలంగాణ హైకోర్టు నుండి అనర్హత వేటు ఎదుర్కోంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తోంది. పార్టీ అధిష్ఠానం నుంచి బలమైన భరోసా లభించినట్లు సమాచారం. పార్టీలో అత్యంత కీలకమైన నేత వనమాకు ఫోన్ చేసి ధైర్యం చెప్పినట్లు -విశ్వసనీయ వర్గాల సమాచారం.
రెండ్రోజుల నుంచి సదరు కీలకనేత వనమాతో పలు దఫాలు ఈ విషయంలోనే చర్చించినట్లు తెలుస్తోంది. రాజకీయ జీవతంలో ఇలాంటి సంఘటనలు సహజంగానే జరుగుతుంటాయని , ఆధైర్య పడవద్దని .. పై కోర్టులో అప్పీల్ కోసం తగిన సహకారం అందిస్తామని సదరు నేత వనమాకు భరోసా ఇచ్చినట్లు సమాచారం.
ప్రజా క్షేత్రంలో గెలిచిన వారే ప్రజాస్వామ్యంలో నిజమైన ప్రజాప్రతినిధులని … ధర్మం కచ్చితంగా గెలుస్తుందని సదరు నేత వనమాకుభరోసా ఇచ్చి భుజం తట్టి ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా వనమా వేసిన అప్పీల్పై ఇవ్వాల (గురువారం) మరి కాసేపట్లో హైకోర్టు తీర్పు రానుంది. ఇది తనకు అనుకూలంగానే ఉంటుందని వనమా ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.