వాజేడు : ములుగు ఏజెన్సీలో మావోయిస్టులు అలజడి సృష్టిస్తున్నారు. అడవుల్లో పోలీసులకు కూంబింగులు నిలిపివేయకపోతే బీఆర్ఎస్ నేతలను పోలీస్ ఇన్ ఫార్మర్లను హత మార్చుతం అంటూ యాక్షన్ టీం కమాండర్ బద్రు కామ్రేడ్ వెంకటేష్ పేరిట ములుగు జిల్లా ఏటూరునాగారం కేంద్రంగా లేక విడుదల చేశారు. ఈ లేక విడుదలతో ఏజెన్సీ ప్రాంతాల్లో అలజడి మొదలైంది. ఇప్పటికే పోలీసులు ఏజెన్సీ మండలాల్లో మావోయిస్టు యాక్షన్ టీములు సంచరిస్తున్నాయని ఏటూర్ నాగారం సబ్ డివిజన్ పరిధిలోని వాజేడు వెంకటాపురం కన్నయ్య గూడెం మంగపేట ఏటూరు నాగారం మండలాల పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఒకవైపు పోలీసులు తనిఖీలు చేస్తుండగా మరోవైపు మావోయిస్టులు యాక్షన్ టీం కమాండర్ బద్రు పేరిట లేక విడుదల చేయడంతో ఏజెన్సీ ప్రాంతం ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
పోలీస్ ఇన్ ఫార్మర్ లను బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు నుండి మొదలుకొని జిల్లా నేతల వరకు టార్గెట్ చేస్తూ హతమాచ్చుతామని లేఖలో పేర్కొనడం ఏజెన్సీ మండలాల్లో చర్చనీయాంసంగా మారింది. ఇప్పటికే పోలీసులు బిఆర్ఎస్ నేతలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ ఏ క్షణం ఏం జరుగుతుందోనని ఏజెన్సీ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏటూర్ నాగారం సబ్ డివిజన్ కేంద్రంగా యాక్షన్ టీం లేక విడుదల చేయడం కలకలం రేపుతుంది. ఫారెస్ట్ అధికారులు అమాయక ప్రజలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని వారి పద్ధతి మార్చుకోకపోతే మూల్యం చెల్లించక తప్పదని లేఖలో పేర్కొన్నారు. పోలీసులు అందించే డబ్బులకు కక్కుర్తి పడిన కొందరు పోలీస్ ఇన్ ఫార్మర్లుగా మారి పార్టీకి నష్టం చేకూర్చాలని చూస్తున్నారు. వారి పద్ధతి మార్చుకోకపోతే శిక్ష తప్పదని హెచ్చరిస్తూ లేఖలో పేర్కొన్నారు. అడవిలో కూంబింగులు నిర్వహిస్తున్న పోలీసులు వెంటనే వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు మావోయిస్టు యాక్షన్ టీం విడుదల చేసిన లేఖతో టిఆర్ఎస్ నేతల్లో గుబులు మొదలైంది.