కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ మరింత బలోపేతం కావాలని, యావత్ దేశం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ బీఆర్ఎస్ ముఖ్యనేతలు ప్రత్యేక పూజలు చేశారు. భద్రాద్రి ఆలయాన్ని ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోతు కవిత, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ తాతా మధు, జెడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్యలు సందర్శించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక సందర్భంగా బుధవారం ఉదయం వారు ఆలయానికి చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్రపతికి స్వాగత, సత్కారాల ఏర్పాట్ల గురించి రెవెన్యూ, పోలీసు, ఆలయ అధికారులను వారు అడిగి తెలుసుకున్నారు, పలు సూచనలు చేశారు, సలహాలిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ మరింత బలోపేతం కావాలని, తెలంగాణ రాష్ట్రం మాదిరిగానే యావత్ దేశం సుభిక్షంగా ముందుకు సాగాలని భగవంతున్ని వేడుకున్నారు. వేదపండితులు వారిని శాలువాలతో సత్కరించి, స్వామి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement