Tuesday, November 19, 2024

BRS | మ‌హోజ్వ‌ల‌మైన దేశాన్ని సాధించ‌డం కోస‌మే బీఆర్ ఎస్‌.. ప్ర‌తీప‌శ‌క్తులు ఎదురైనా ముందుకెళ్దాం : కేసీఆర్‌

ఏపీకి చెందిన పలువురు నేతలు ఇవ్వాల (సోమవారం) బీఆర్​ ఎస్​ పార్టీలో చేరారు. హైదరాబాద్​లోని తెలంగాణ భవన్​లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్​ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. కేసీఆర్​ మాటల్లోనే..
‘‘స్వాతంత్ర్యానికి పూర్వం జీవితాల‌ను, ఆస్తుల‌ను, కుటుంబాల‌ను, అవ‌స‌ర‌మైతే కుటుంబాల‌ను కూడా త్యాగం చేసిన ప‌రిస్థితులుండేవి. ఆ త‌ద‌నంత‌రం స్వాతంత్ర్యం సిద్ధించిన త‌ర్వాత రాజ్యాంగం ఏర్పాటు చేసుకుని ముందుకెళ్తున్నాం. వార్షిక‌, పంచ‌వ‌ర్ష ప్ర‌ణాళిక‌ల‌తో కొంత మార్గ‌నిర్ధేశం జ‌రిగింది. త‌ద‌నంత‌రం కాలంలో రాజ‌కీయంలో, ప్ర‌జా జీవితంలో అనేక మార్ప‌లు సంభ‌వించాయి. గ‌త యాభై ఏండ్ల సుధీర్ఘ రాజ‌కీయ జీవితంలో చూసి, అనుభ‌వించిన‌వి, చ‌దువుకున్న అంశాల‌ను బేరీజు వేసుకుంటే దేశం చేరుకోవాల‌న్న ద‌శ‌కు చేరుకోలేదు. ప్ర‌జ‌ల కోరిక‌, స్వాతంత్ర్య ఫ‌లం సిద్ధంచ‌లేదు అనేది చాలా బ‌ల‌మైన మాట‌. ఎగ్జాంపుల్ అమెరికా దేశం ఉంది. మ‌న‌కంటే చాలా పెద్ద‌ది, చైనా కూడా మ‌న‌కంటే పెద్ద‌ది. అమెరికాలో 27శాత‌, చైనాలో 16శాతం మాత్ర‌మే సాగుకు యోగ్య‌మైన భూములున్న‌య్‌..

https://twitter.com/i/status/1609923051147362304

అదే ఇండియాలో 83వేల కోట్ల భూములు సాగుకు అందుబాటులో ఉన్న‌యి. ఇందులో స‌గం మేర అత్య‌ద్భుతంగా పంట‌లు పండించే భూములున్న‌య్‌. అట్లాంటిది అనుకున్న మేర‌కు పంట‌లు పండ‌డం లేదు. 1.40ల‌క్ష‌ల టీఎంసీల నీరు కురిస్తే వాటిని ఒడిసిప‌ట్టి సాగులోకి తెచ్చే ఆలోచ‌న‌లు లేవు. పంట‌లు పండ‌డానికి కావాల్సిన ప‌రిస్థితులు ఎన్ని ఉన్నా.. వాటిని అందిపుచ్చుకుని సాగులోకి తెచ్చే ఆలోచ‌న లేదు. రైతుల‌ను మామూలుగా ప్రోత్స‌హిస్తే భార‌త దేశం యావ‌త్ ప్ర‌పంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. కానీ, రైతులు ఏడాది పాటు ధ‌ర్నాలు చేసే దారుణం చూశాం. మ‌న పిల్ల‌లు మెక్‌డోనాల్డ్ బ‌ర్గ‌ర్లు, పిజ్జాలు చూసే ప‌రిస్థితులు వ‌చ్చిన‌య్‌. ప్ర‌పంచ వ్య‌ప్తంగా బెస్ట్ ఫుడ్ కావాల‌నే ప‌రిస్థితులు ఇత‌ర దేశాల్లో వినిపిస్తున్నాయి. కానీ, దుర‌ద్రుష్ట‌మేంటంటే పామాయిల్‌, కందిప‌ప్పు వంటివి ఇత‌ర దేశాల‌నుంచి దిగుమ‌తి చేసుకోవాల్సి వ‌స్తంది.. ఇట్లాంటి ప‌రిస్థితుల నుంచి దేశాన్ని కాపాడుకుందాం. బీఆర్ ఎస్ అంటే త‌మాషా కోసం, రాష్ట్రం కోసం రాలేదు. బీఆర్ ఎస్ ఫ‌ర్ ఇండియా..

క‌చ్చితంగా ల‌క్ష కిలోమీట‌ర్ల ప్ర‌యాణం అయినా.. ఒక్క అడుగుతోనే ప్రారంభం అవుతుంది. ల‌క్ష్య శుద్ది, చిత్త శుద్ధి ఉంటే సాధించ‌లేనిది ఏదీ ఉండ‌దు. ఇంత గొప్ప దేశంలో వ‌న‌రులు ఉండి, వ‌స‌తులు ఉండి వ్య‌వ‌సాయాన్ని బాగు చేసుకోలేక‌పోతున్నాం. అంతేకాకుండా సోలార్‌, హైడ‌ల్‌, ప‌వ‌న విద్యుత్ ప‌రంగా కూడా ఎంతో సాధించుకోవ‌చ్చు. కానీ, దాన్ని కూడా ఒడిసిప‌ట్టుకోలేని ప‌రిస్థితి దాపురించింది. వ‌న‌రులు, వ‌స‌తులు ఉండి కూడా ఈ దేశ ప్ర‌జ‌లు ఎందుకు వంచించ‌బ‌డాలే అన్న‌దే ప్ర‌శ్న‌.

- Advertisement -

ఆ మార్పు కోసమే గుణాత్మ‌క మార్పు తీసుకురావాల‌న్న సంక‌ల్పం.. ఓ మ‌హోజ్వ‌ల‌మైన దేశాన్ని తీర్చిదిద్దాల‌న్న‌దే బీఆర్ ఎస్ న‌ష్టం. ప్ర‌తీప శ‌క్తులు ఎదుర‌యినా ఎక్క‌డా ఆగ‌కుండా ముందుకెళ్దాం. ”అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement