నెలాఖరున ఢిల్లీకి దళపతి
నాలుగైదు రోజులు మకాం
భారాస విస్తరణ లక్ష్యం
పార్టీ జాతీయ అజెండా విధివిధానాలపై విస్తత సమాలోచనలు
17న రాష్ట్రానికి పలువురు సీఎంలు, కీలక నేతలు
జాతీయ రాజకీయాలపై చర్చ
త్వరలో కర్ణాటక, ఒడిశాలలో సభలు
హైదరాబాద్ ఆంధ్రప్రభ ప్రధాన ప్రతినిధి: జాతీయ స్థాయిలో పార్టీని భారీగా విస్తరించేందుకు పకడ్బందీ ప్రణాళికను రూపొందిస్తున్న భారత రాష్ట్ర సమితి (భారాస) అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆ పనిలో తలమునకలయ్యారు. జాతీయ స్థాయిలో కలిసి వచ్చే పార్టీలు, సంస్థలను ఏకం చేసే పనిలో అయన నిమగ్నమైనట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిశాక ఈ నెల చివరిలో నాలుగైదు రోజుల పాటు ఢిల్లిdలో మకాం వేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాదిలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు అవసరమైన వ్యూహాన్ని చర్చించి అమలు చేయాలని భావిస్తున్న గులాబీ అధినేత కేసీఆర్ #హస్తిన పర్యటనలో ఇదే అంశంపై కీలక భేటీలు నిర్వ#హంచి సమాలోచనలు జరపాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇందులో భాగంగా అయన గత ఆరు మాసాలుగా వివిధ పార్టీల ముఖ్యులతో సమావేశమ వుతున్న విషయం తెలిసిందే. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దిగి అధికారాన్ని #హస్తగతం చేసుకుంటే అమలు చేయ తలపెట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధిన సమాచారాన్ని సేకరిస్తున్న భారాస ఇందుకు అవసరమైన విధి విధానాలను రూపొందిస్తోంది. జాతీయ స్థాయిలో జల, విద్యుత్, ఆర్థిక, వ్యవసాయ, విద్య తదితర ప్రధాన రంగాలకు సంబంధించిన విధానాల రూపకల్పనకు ఆయా రంగాలకు చెందిన ప్రముఖులు, నిష్ణాతులు, విశ్రాంత సివిల్ సర్వీసెస్ అధికారులు, వర్సిటీల ఆచార్యులతో ఢిల్లిdలో వరుస సమావేశాలు జరిపేందుకు కేసీఆర్ సమాయత్తమవుతున్నట్టు చెబుతున్నారు.
ఈ ఆదివారంతో శాసన సభ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. 17వ తేదీన తెలంగాణ నూతన సచివాలయ భవనాన్ని ప్రారంబించాలని ము#హుర్తాన్ని ఇప్పటికే ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పార్టీల కీలక నేతలను సీఎం ఆహ్వానించారు. వారంతా వస్తున్నట్టు సమ్మతి కూడా తెలిపారు. #హదరాబాద్ వస్తున్న తమిళనాడు, ఢిల్లిd, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్టాలిన్, అరవింద్ కేజ్రీవాల్, భగవత్‌సింగ్ మాన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌తో సహా వివిధ రాష్ట్రాల నుంచి వస్తోన్న ఆయా పార్టీల కీలక నేతలు, రైతు సంఘాల ప్రముఖులతో ప్రగతి భవన్లో సమావేశమై జాతీయ రాజకీయాలపై చర్చించాలని భారాస చీఫ్ కేసీఆర్ భావిస్తున్నారు. ఉదయం సచివాలయ భవనం ప్రారంభించిన అనంతరం అతిధులకు ప్రగతిభవన్‌లో కేసీఆర్ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇది ముగిశాక అక్కడే వారితో జాతీయ రాజకీయాలపై చర్చించనున్నట్టు భారాస వర్గాలు చెబుతున్నాయి. అదే రోజు సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వ#హస్తున్న బారాస భారీ బ#హరంగ సభలో సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపైనే కీలక ప్రసంగం చేయనున్నట్టు సమాచారం.
కర్ణాటక, ఒడిశాలలో సభలు
నాందేడ్ సభ విజయవంతం కావడంతో ఇంత కన్నా మిన్నగా కర్ణాటక, ఒడిశాలలో భారాస బ#హరంగ సభల నిర్వ#హణకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. కర్ణాటకలో త్వరలో జరిగే అసెంబ్లిd ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సభకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసి భారీ ఎత్తున జన సమీకరణ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలోని గుల్బర్గా, బెంగళూర్ నగర పరిసర ప్రాంతం లేదా బళ్లారిలలో సభను నిర్వ#హస్తే ఎలా ఉంటుందన్న అంశంపై సమాలోచనలు జరుపుతున్నట్టు సమాచారం. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో బ#హరంగసభను నిర్వ#హంచాలని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ ప్రతిపాదించారు. భారాస రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించి అదే రోజున బ#హరంగ సభ ఏర్పాటు చేసేందుకు గమాంగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఒడిశా భారాస రాష్ట్ర కార్యాలయం ఏర్పాటుకు ఇప్పటికే రెండు అద్దె భవనాలను గుర్తించిన గమాంగ్, అందులో ఒక భవనాన్ని ఎంపిక చేసే పనిలో వున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు భువనేశ్వర్‌లో మకాం వేసి పార్టీ కార్యాలయం భవన ఎంపిక బ#హరంగ సభ ఏర్పాట్లపై చర్చిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంతో పాటు ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వరుస సభలను నిర్వ#హంచాలని భారాస ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెబుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లో రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రలలో విడివిడిగా బ#హరంగ సభలు నిర్వ#హంచే అంశంపై భారాసలో చర్చోపచర్చలు జరుగుతున్నట్టు సమాచాచారం. తొలుత విజయవాడ లేదా గుంటూరు కేంద్రంగా తొలి సభను జరిపి నెల లేదా రెండు నెలల విరామం తర్వాత మిగిలిన సభలను జరపాలన్న యోచనలో భారాసా అధినాయకత్వం ఉన్నట్టు చెబుతున్నారు.