బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీ అధినేత కేసీఆర్ ఎర్రవల్లిలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మండలి విపక్ష నేత మధుసూదనా చారి, కేటీఆర్, హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.
ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఉభయ సభల్లో ఏ అంశాలపై ప్రశ్నించాలి? ఏ అంశాలపై ఎండగట్టాలనే అంశంపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు.