Friday, October 18, 2024

ENG vs PAK | బ్రూక్ త్రిశ‌త‌కం.. ఓట‌మి దిశ‌గా పాక్!

ముల్తాన్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ పరుగుల వరద పారిస్తోంది. హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీ, జో రూట్ డబుల్ సెంచరీతో విజృంభించారు. దీంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల న‌ష్టానికి 823 ప‌రుగులు సాధించి… డిక్లేర్ చేసింది.

జో రూట్ (375 బంతుల్లో 17 ఫోర్లు *262 ప‌రుగుల‌), హ్యారీ బ్రూక్ (322 బంతుల్లో 29 ఫోర్లు, మూడు సిక్సర్లతో *317 పరుగులు) పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. వీరిద్ద‌రూ నాలుగో వికెట్‌కు 454 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

కాగా, రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్…. నాలుగో రోజు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి.. 156 ప‌రుగులు చేసింది. సల్మాన్ అఘా (41 నాటౌట్) టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. ఇన్నింగ్స్ ఓట‌మి త‌ప్పించుకోవాలంటే ఇంకా 115 ప‌రుగులు చేయాల్సి ఉంది. అయితే, చేతిలో కేవ‌లం నాలుగు చివ‌రి వికెట్లు మాత్రిమే ఉండ‌టంతో ఈ టెస్టులో పాక్ ఓట‌మి చెంద‌టం త‌ధ్యం అనిపిస్తొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement