చేప ఖరీదు ఎంత ఉంటుంది మహా అయితే వేలల్లో అనే మనకు తెలుసు..కానీ ఓ చేప ఖరీదు ఏకంగా కోట్ల రూపాయలు పలుకుతోందంటే వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ..కానీ ఇది అక్షరాలా నిజం. సీ ఫుడ్ ని ఇష్టపడని వారు ఉంటారా..అంతేకాదు ఈ సీ ఫుడ్ అంటే జపనీయులకు ప్రాణం. జపాన్ ప్రజలు మాంస ప్రియులు. వారు ఎక్కువగా సీఫుడ్ ని ఇష్టంగా తింటారు. దీంతో 2019లో జపాన్‌లోని టోక్యోలో 278 కిలోల బరువు ఉన్న బ్లూఫిన్ టూనా ఫిష్ దొరకగా..దాన్ని వేలం వేశారు.. ఆ చేపని ఏకంగా 2.5 మిలియన్ పౌండ్లకు అమ్మేశారు. అంటే మన కరెన్సీలో రూ. 25కోట్లకు పైనే. దీంతోనే అర్థమవుతోంది ఆ చేప అతి అరుదైనది..ఖరీదైనది కూడా అని.
అయితే ఈ జాతి చేపలు అంతరించి పోతుండటంతో.. వాటిని కాపాడటం కోసం ఆ చేపలను పట్టడాన్ని యూకేలో నిషేధించారు. ఒకవేళ ఎవరైనా దాన్ని పట్టుకుని అమ్మితే భారీ జరిమానాతో పాటు.. జైలుశిక్ష కూడా విధిస్తారు. .సముద్ర చేపల్లో అత్యంత రుచిరకంగా ఉండే చేపగా టునా చేపకు ఎంతో పేరుంది. జపాన్ రాజధాని టోక్యోలోని ప్రపంచ ప్రఖ్యాతి పొందిన సుకిజీ చేపల మార్కెట్లో.. ఏటా నూతన సంవత్సరం సందర్భంగా పెద్ద ఎత్తున టునా చేపల వేలం కార్యక్రమం జరుగుతుంది.అప్పుడు జనం పెద్ద ఎత్తున్న తరలివస్తారు.
కాగా తాజాగా బ్లూఫిన్ టూనా చేప బ్రిటన్ సముద్రంలో కనిపించింది. యూకేలోని కార్న్‌వాల్‌లో దీన్ని చూసిన ఓ వాలంటీర్ దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయటంతో మరోసారి ఈ బ్లూఫిన్ టూనా చేప వార్తల్లోకి వచ్చింది. అయితే జపాన్‌లో ఈ చేపను పట్టుకోవడానికి గానీ అమ్మటానికి గానీ ఎటువంటి అడ్డంకులు లేవు.కానీ యూకేలో ఈ చేపను వేటాడటం, దాన్ని అమ్మటం నిషేధం. ఒకవేళ సముద్రంలో చేపలు పడుతుండగా.. ఆ చేప దొరికినా కూడా దాన్ని సముద్రంలో వదిలేయాలి. గతంలో ఒకసారి ఈ చేప బ్రిటీష్ ఐలాండ్‌లో ఉన్న ఐర్లాండ్ సౌత్ కోస్ట్‌లో దొరికింది. 270 కిలోల బరువున్న ఆ చేపను ఓ మత్స్యకారుడు పట్టుకున్నప్పటికీ.. దాన్ని తిరిగి సముద్రంలోకి వదిలివేయాల్సి వచ్చింది.