భారత్‌లో B.1.617 కరోనా వైరస్ వేరియంట్ పెను విలయం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి వేరియంట్ కేసులు ఇప్పుడు బ్రిటన్‌లో నమోదు అవుతున్నాయి. ఇండియాలో బీభత్సం సృష్టించిన B.1.617 వేరియంట్‌కు సంబంధించి.. బ్రిటన్‌లో సుమారు 2300 కేసులు నమోదు అయినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి మ్యాట్ హాన్కాక్ తెలిపారు. ఇంగ్లండ్‌లోని బోల్టన్, బ్లాక్బర్న్ ప్రాంతాల్లో ఈ వేరియంట్ కేసులు రెట్టింపు అవుతున్నట్లు కూడా ఆయన తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఇండియన్ వేరియంట్ కేసులను గుర్తించినట్లు స్థానికంగా 86 ప్రాంతాల అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా త్వరగా వ్యాక్సిన్లు వేయించుకోవాలని మంత్రి కోరారు. బోల్టన్‌లో ఇండియన్ రకం వైరస్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని, కానీ ఆ ప్రాంతవాసుల్లో చాలా మంది ఇంకా టీకాలు వేసుకోలేదని, అక్కడున్నవారు తక్షణమే టీకాలు తీసుకోవాలని మంత్రి మ్యాట్ కోరారు. కొత్త వేరియంట్ కేసులు అధికం అవుతున్న నేపథ్యంలో జూన్ 21వ తేదీ నాటికి ఆంక్షలను ఎత్తివేసే ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నట్లు స్థానికులు భావిస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement