Friday, November 22, 2024

ధరణి పోర్టల్ తెచ్చి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు : బండి సంజ‌య్‌

ధరణి పోర్టల్ తెచ్చి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ధ్వజమెత్తారు. పోడు భూముల సమస్యలపై సోమవారం కరీంనగర్ లో మౌన దీక్ష చేపట్టిన ఆయన దీక్ష విరమణ అనంతరం మాట్లాడుతూ.. కుర్చీ వేసుకుని సమస్యలు పరిష్కరిస్తానని సీఎం చెబుతుంటారని. అందుకే నా దీక్షలో మహారాజా కుర్చీ వేశానన్నారు. నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలేనని, కరప్షన్ గురించి కేసీఆర్ మాట్లాడటం… దయ్యాలు వేదాలు వల్లించినట్లే అన్నారు.

తన కుటుంబ సభ్యులకు బంధువులకు మేలు చేసేందుకే ధరణి తెచ్చారని, ధరణి వల్ల అనేక మంది రైతుల భూములు గల్లంతయ్యాయి అన్నారు. కబ్జాకాలం తీసేయడంతో అనేక మంది భూములు కోల్పోవాల్సి వస్తోందని, భూ సమస్యలపై అడిగేందుకు వెళితే… మా చేతిలో ఏమీ లేదని అధికారులు చేతులెత్తేస్తున్నారన్నారు. ఎకరాలకు ఎకరాలు గల్లంతయ్యాయని, లేని సమస్యలు తెచ్చి కోర్టుల చుట్టూ తిరిగేలా చేశాడన్నారు. రెవెన్యూ ఆఫీసుల్లో ధరణి లోపాల దరఖాస్తులతో నిండిపోయాయని, టీఆర్ఎస్ నేతలే ధరణితో ఇబ్బందులున్నాయని చెబుతున్నారని అన్నారు. వేల కోట్ల విలువైన భూములు కేసీఆర్ బంధువుల పేరిట మార్చుకున్నాడని, తన బండారం బయట పడుతుందనే ధరణిని కొనసాగిస్తున్నాడని అన్నాడు. పోడు భూములను నమ్ముకుని బతుకుతున్న గిరిజనులపై దండయాత్ర చేపిస్తున్నాడని, ఎన్నికలొచ్చిన ప్రతిసారి పోడు భూముల సమస్యను కుర్చీ వేసుకుని పరిష్కరిస్తానని చెప్పడం మాట తప్పడం అలవాటుగా మారిందని బండి సంజ‌య్ మండిప‌డ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement