Wednesday, November 20, 2024

కుమారైల‌తో పాటు కుమారుల‌ను స‌రైన మార్గంలో పెంచండి.. ట్వికిల్ ఖ‌న్నా

పిల్ల‌ల్ని క‌నేముందు వారిని ఎలా పెంచాలో శిక్ష‌ణ తీసుకోవాల‌ని సూచించారు బాలీవుడ్ న‌టి ట్వింకిల్ ఖన్నా. ఒక వాహనం నడిపే ముందు దానిపై శిక్షణ తీసుకుని, పరీక్ష పాస్ అయి, లైసెన్స్ తీసుకుంటాం కదా. అచ్చం అదే మాదిరి పిల్లలను కనే ముందు వారిని ఎలా పెంచాలనే విషయమై శిక్షణ తీసుకోవడం ఎంతో అవసరం అని తన స్వీయ అనుభవం నుంచి సూచన చేశారు.ఇటీవలే ముంబైలో ఆటో నడిపి ఆమె వార్తలకెక్కారు కుమార్తెల పెంపకంపైనే దృష్టి సారించడం కాదు, కుమారులను సరైన మార్గంలో ఎలా పెంచాలనే దానిపై నేను ఇటీవలే కాలమ్ రాశానని చెప్పారు. ట్వింకిల్ ఖన్నా నటుడు అక్షయ్ కుమార్ ను వివాహం చేసుకోవడం తెలిసిందే. వీరికి ఆరవ్, నితార అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. పేరెంటింగ్ గురించి ట్వింకిల్ తరచూ మాట్లాడుతుంటారు. ఆమె ఇప్పుడు రచనలు సైతం చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement