ఓ పెళ్లి బరాత్ లో ఎవ్వరూ ఊహించని సంఘటన జరిగింది. ఓపెన్ కారులో కూర్చున్నవధువును చూపించేందుకు వరుడు ..వధువు చేతిని పట్టుకుని గాలిలో కాల్పులు జరిపాడు.. ఇలా ఒకటి తర్వాత ఒకటి ఇలా 4 రౌండ్లు కాల్పులు జరిపారు. అయితే.. వధూవరుల ఈ చర్యకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై ఆయుధాల చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలతో మీరట్‌లోని మవానా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ తర్వాత ఆ ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వైరల్ గా మారిన వీడియోలో.. కారులో కూర్చున్న వధూవరులు కలిసి పిస్టల్‌తో కాల్పులు జరిపినట్టు స్పష్టమైతోంది. నగరంలోని ఓ పేరెన్నికగన్న కుటుంబానికి చెందిన అమ్మాయి పెళ్లికి సంబంధించిన బరాత్ గా తెలుస్తోంది. మొత్తం వ్యవహారం మీరట్‌లోని మవానా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వధూవరుల జరిగిన కాల్పుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో మీరట్ ఎస్పీ, కేశవ్ కుమార్ దృష్టికి వెళ్లడంతో పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. పోలీసులు ఇద్దరి కోసం వెతుకుతున్నారు. కాల్పులు జరిపిన ఆయుధంపై కూడా దర్యాప్తు జరుగుతుంది. ఈ విషయమై ఎస్పీ దేహత్ కేశవ్ కుమార్ మాట్లాడుతూ.. మాకు వీడియో లభించిందని చెప్పారు. వారిపై కేసు నమోదు చేశామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. వారు ఉపయోగించి రివాల్వర్ కు లైసెన్స్ ఉందా? లేదా అనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతోందన్నారు.
పెళ్లి బరాత్ లో గాల్లో కాల్పులు జరిపిన వధువు.. వరుడు-కేసు నమోదు చేసిన పోలీసులు
Advertisement
తాజా వార్తలు
Advertisement