Friday, November 22, 2024

ట్రాక్ట‌ర్ న‌డుపుతూ – పెళ్లి మండ‌పానికి వ‌చ్చిన పెళ్లికూతురు

కాలంతో పాటే ప‌లు విష‌యాల్లో కూడా మార్పులు వ‌స్తున్నాయి. కాగా పెళ్లిలో సిగ్గు ప‌డాల్సిన పెళ్లి కూతుర్లు డ్యాన్స్ ని ఇర‌గ‌దీస్తున్నారు..అయితే ఓ పెళ్లికుమారై ఏకంగా ట్రాక్ట‌ర్ ని డ్రైవ్ చేస్తూ క‌ల్యాణ మండ‌పానికి చేరుకోవ‌డం విశేషం. ఈ సంఘ‌ట‌న
మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లా జావ్రా గ్రామంలో ఓ నవ వధువు ట్రాక్టర్ నడుపుకుంటూ కల్యాణ మండపానికి చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. గ్రామానికి చెందిన భారతి తద్గేకు పొరుగూరు యువకుడితో వివాహం నిశ్చయమైంది. వధువు భారతి తన అన్నదమ్ములిద్దరినీ చెరో పక్కన కూర్చోబెట్టుకుని ట్రాక్టర్ నడుపుకుంటూ మండపానికి చేరుకుంది. పెళ్లి దుస్తుల్లో ఉన్న వధువు, నల్లని కళ్లద్దాలు ధరించి హుందాగా ట్రాక్టర్ నడుపుకుంటూ మండపానికి వచ్చింది. పెళ్లి కుమార్తె అలా రావడం చూసిన వరుడు సహా పెళ్లికొచ్చిన వారు షాకయ్యారు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement