ఓ యువతి పెళ్లిలో ఆమె పక్కనే ఓ ముగ్గురు.. తోడు పెళ్లికూతుళ్లలా.. గులాబి రంగు గౌన్లు, పొడవాటి కురులు, మెకప్ మెరుగులతో పెళ్లికూతురు కంటే అందంగా తయారై ఆహుతుల మనసు దోచుకున్నారు… ఇదేంటి పెళ్ళి లో ఈ తంతు కామనే కదా అని అనుకుంటున్నారా.. ఆగండి ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్.. చైనా, హెనాన్ ప్రావిన్స్‌లోని పింగ్డిన్షాన్ అనే నగరంలో ఓ యువతి తన ఫ్రెండ్స్ నే(అబ్బాయి) తోడు పెళ్ళి కూతురు గా మార్చింది.
అక్కడి సంప్రదాయం ప్రకారం పెళ్లి కూతురు స్నేహితురాళ్లే తోడిపెళ్లికూతుళ్లుగా ఉండాలి. కానీ పెళ్లికూతురికి స్నేహితురాళ్లు లేకపోవడంతో ఆమె తన మగ స్నేహితులనే తోడిపెళ్లికూతుళ్లుగా మార్చేసింది. ఆ ప్లాన్ సక్సెస్ అయింది. అతిథులెవరూ వాళ్లు అబ్బాయిలని పసిగట్టలేకపోయారు పైగా అందమైన అమ్మాయిల్లా కనిపించే సరికి పెళ్లికూతురిని పక్కన పెట్టి మరీ ఫొటోలు, వీడియోలు తీసుకోవడం మొదలుపెట్టారు. తర్వాత వాళ్లు అబ్బాయిలు అని తెలిసేసరికి ఆ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.