చాక్లెట్స్ తో కేశాలంకరణ చేసుకుంది ఓ పెళ్లికూతురు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ 50 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోలో హెయిర్‌స్టైలిస్ట్ వధువు జడకు కిట్‌క్యాట్, ఫైవ్‌స్టార్, ఫెరెరో, రోచర్, మిల్కీబార్ వంటి చాక్లెట్లతో కేశాలంకరణ చేయడం కనిపిస్తుంది.
పెండ్లి కూతురు పూల జడతో ముస్తాబవడం చూసినా ఈ వధువు మాత్రం విభిన్నంగా కనిపించేందుకు చాక్లెట్లతో కేశాలంకరణతో ముందుకొచ్చింది. ఇయర్ రింగ్స్, నెక్లెస్ వంటి ఆభరణాలు కూడా చాక్లెట్లతో చేసినవి ధరించింది. పెండ్లి కూతురు హెయిర్‌స్టైల్‌పై నెటిజన్లు షాక్ తిన్నారు. సారీ…మీ హెయిర్‌స్టైల్ నాకు నచ్చలేదని ఓ యూజర్ రాసుకొచ్చారు. ఇంట్లో ఆడుకుంటూ బాల్యంలో ఇలాంటి పనులు చేశామని, సీరియస్‌గా ఇలాంటి పనులు ఎప్పుడూ చేయలేదని మరో యూజర్ కామెంట్ చేశారు.