సభ్య దేశాలతో ద్వైపాక్షిక చర్చలు
గ్లోబల్ డెవలప్‌మెంట్ ప్రధాన ఎజెండా
ఆర్తిక సహకారం, సంస్కృతి, సంప్రదాయాల ప్రమోషన్
సభ్య దేశాలుగా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా
ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ : రష్యాలోని కజన్ సిటీలో జరగనున్న 16వ బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోడీ మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరారు. అక్టోబర్ 22వ తేదీ నుంచి ఈ సమావేశాలు జరగనున్నాయి. బ్రిక్స్ దేశాలకు చెందిన నేతలతో మోడీ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనే అవకాశాలున్నాయి.
బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని భారత్ గౌరవిస్తుందని మోడీ తన సందేశంలో పేర్కొన్నారు. గ్లోబల్ డెవలప్మెంట్ ఎజెండా, వాతావరణ మార్పులు, ఆర్థిక సహకారం, సంస్కృతి, సంప్రదాయల ప్రమోషన్ లాంటి అంశాల్లో చర్చించనున్నట్లు మోడీ తెలిపారు. కాగా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా దేశాల కూటమిని బ్రిక్స్ అంటారు.