Wednesday, November 20, 2024

ఆమ్యామ్యా ఇచ్చుకో… ఆర్డర్‌ పుచ్చుకో!

ముడుపులిస్తేనే ఇంక్రిమెంట్లు, రెగ్యులరైజేషన్‌, పోస్టింగ్‌లు
రూ.5 వేల నుంచి 3 లక్షల దాకా రేట్లు
ఫోన్‌లోనే రాయబేేరాలు
ఇవ్వకపోతే ఫైల్‌ పెండింగ్‌
ఉన్నతాధికారి కనుసన్నల్లో అవినీతి
ఓ చిరుద్యోగి విచ్చలవిడి దందా
ఆరోగ్యశాఖ ఈ- 6 సెక్షన్‌లో అవినీతి జబ్బు
ఫిర్యాదుల వెల్లువ.. స్పందనకే కరవు

అమరావతి,ఆంధ్రప్రభ: రాష్ట్ర ఆరోగ్య శాఖలో అ మ్యామ్యాల దందా యదేచ్ఛగా సాగిపోతోంది. సర్వీస్‌ రెగ్యులరైజేషన్‌కు 10 వేలు.. స్పెషల్‌ గ్రేడ్‌ ఇంక్రిమెంట్‌ల కు ఐదువేలు.. రిలీవింగ్‌ ఆర్డర్‌ కు రూ.10 వేలు.. పోస్టిం గ్‌కు ఐతే లక్ష రూపాయల నుండి ఇచ్చే ప్రాంతాన్ని బట్టి మూడు లక్షల వరకు ముక్కుపిండి మరీ వసూలు చేస్తు న్నారని వైద్య ఉద్యోగులు, అధికారులు గగ్గోలు పెడుతు న్నారు. డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ విభాగంలో ఈ 6 సెక్షన్‌ కేం ద్రంగా అవినీతి రాజ్యమేలుతోందన్న విమర్శలు బలం గా వినిపిస్తున్నాయి. ఓ ఉన్నతాధికారి కనుసన్నల్లో అవి నీతి లీలలు సాగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయి. వైద్యాధికారుల సర్వీస్‌ రెగ్యులరైజేషన్‌, రిలీ వింగ్‌, మూమెంట్‌ ఆర్డర్స్‌ మరియు పోస్టింగ్‌ ఆర్డర్స్‌ వంటి కీలకమైనటు-వంటి ఉత్తర్వులు ఇచ్చే ఈ విభాగంలో నిత్యం లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయని కార్యాలయ ఉద్యోగులే గుసగుస లాడుకుంటున్నారు. సర్వీస్‌ రెగ్యుల రైజేషన్లకు సంబంధించి ఓ ఉద్యోగి నేరుగా సంబంధిత వైద్యులకు ఫోన్లు చేసి రూ. 10 వేలు ఇస్తే మీ పనైపోతుందని చె బుతున్నాడు. డైరెక్ట ర్‌ ఆఫ్‌ హెల్త్‌లో ఓ ఉన్నతాధికారి తరుపునే తాను మామూళ్ళు వసూళ్ళు చే స్తున్నానని ఏ పనైనా చిటి కెలో చేయించే స్తానని ఫోన్‌లో నే ఉద్యోగులకు భరోసా ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఉద్యో గి సెల్‌ఫోన్‌ కాల్‌డేటాను ఏసీబీ అధికారులు పరిశీలిస్తే అక్రమాల గుట్టు బట్టబయల య్యే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తు న్నాయి.

అడిగినంత ఇవ్వకుంటే కొర్రీ
డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ సెక్షన్‌లో ఓ ఉన్నతాధికారి ప్రభుత్వ పెద్దల పేర్లు చెప్పి తన పై అధికారుల్ని సైతం బెదిరిస్తున్నాడనే అభియోగాలు ఉన్నాయి. ఆ అధికారిగా బంటుగా మారిన చిరుద్యోగి ఫోన్‌లోనే దందా చేస్తున్నాడని వైద్య ఉద్యోగులు వాపోతున్నారు. అడిగినంత ఇవ్వకుంటే తమ ఫైల్‌లో కొర్రీ వేసేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పీహెచ్‌సీ నుంచి వచ్చి.. దందా
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే సమయంలోనే చిరుద్యోగిపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. పనిచేసే అనేక అవినీతి ఆరోపణలతో డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌కు వెళ్లిన ఈ ఉ ద్యోగి తన అవినీతి ప్రదర్శ నతో ఉన్నతాధికారులతో పాటు-
ప్రభుత్వాన్ని కూడా మచ్చ ఏర్పడుతుందని సాటి సిబ్బంది తెలియజేస్తున్నారు. డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌కు పీహెచ్‌సీ నుండి వచ్చే కోటాలో పలువురు సీనియర్‌ అసిస్టెంట్‌ల ను కాదని ఈ ఉద్యోగికి ప్రాధాన్యత ఇవ్వ డంపై అప్పట్లోనే పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. రికా ర్డుల్ని పరిశీలిస్తే వాస్తవాలు వెలుగు చూ స్తాయని పలువురు ఉద్యో గులు బహాటంకంగా అంటు న్నారు. ఉన్నతాధి కారి అండదండలు ఉండటం తో ఆ ఉద్యోగి మామూ ళ్ల హవా కొనసాగిస్తు న్నాడనే అభియోగా లు ఉన్నాయి. పలు పోస్టింగ్లలో ఉన్నతా ధికార్ల పేర్లు చెప్పి పెద్ద మొత్తంలో అమ్యామ్యా లు గుంజాడన్న ఆరోపణ లు ఉన్నాయి.

- Advertisement -

వైద్యశాఖ మంత్రి దృష్టి సారించాలి
రాష్ట్ర వైద్యశాఖ మంత్రిగా బాధ్య తలుచేపట్టిన తరువాత విడదల రజిని డీఎంఈ కార్యాలయంలో దృష్టి సారించారు. గతంలో పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడ్డ రాఘవేంద్రరావును విధుల నుంచి తప్పించారు. ఏపీవీవీపీ కమిషనర్‌ వినోద్‌ కుమార్‌కే డీఎం ఈగా అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో డీఎంఈ కార్యాలయ పనితీరు ఒకింత మెరుగుపడిందన్న అభిప్రా యాలు వ్యక్తం అవుతున్నాయి. డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ విభాగంపై గత కొంత కాలంగా తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఓ ఉన్నతాధికారి కనుసన్నల్లోనే ఈ6 విభాగంలో దోపిడీ జరుగుతోందనేది బహిరంగ రహస్యం. దీనిపై వైద్యశాఖ మంత్రి దృష్టిసారిస్తే మరిన్ని నిజాలు తెలుస్తాయని పలువురు ఉద్యోగులు పేర్కొంటున్నారు.

ఆ సెక్ష‌న్ పైనే ఆరోప‌ణ‌లు…
డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ హెల్త్‌ లో ఈ 6సెక్షన్‌ పై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈ సెక్షన్‌పై గతంలో కూడా అనేకమంది వైద్య అధికారులు ఆరోపణలు చేశారు. అయితే చర్యలు తీసుకొనే సాహసం మాత్రం ఏ అధికారి చేయలేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే సీసీ కెమెరాలను బిగించిన ఉన్నతాధికారులు రాష్ట్ర కార్యాలయమైన డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ లో ముఖ్య విభా గాలలో సీసీ కెమెరాలు బిగించపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. ఎక్కడ ఫిర్యాదు చేస్తే తమ ఉద్యోగానికి ముప్పు వస్తుందో అన్న భయంతో లక్షలు ఇచ్చిన ఉ ద్యోగులు సైతం మి న్నకుండి పోతు న్నారు. ప్రతి వై ద్యుడిని పిలిచి విచారణ చేస్తే అక్రమాల డొంక కదులుతుందన్ని వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాన్ని నిబంధన ప్రకారం లంచం ఇవ్వడం తీసుకోవడం నేరం అన్న బోర్డులు కానీ, ఏసీబీ ఫోన్‌ నెంబర్లు కానీ డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ సెక్షన్లో లేకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement