Wednesday, January 8, 2025

TG | నిందితుడి నుంచి లంచం.. ఏసీబీ వ‌ల‌లో తొర్రూరు ఎస్‌ఐ

వరంగల్, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ ఎస్‌ఐ కె.జగదీష్ ఏసీబీ వ‌ల‌కు చిక్కాడు. ఓ నిందితుడి నుంచి రెండు ల‌క్ష‌ల లంచం తీసుకుంటుండ‌గా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం..

ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి నుంచి ఎస్‌ఐ కె.జగదీష్ లంచం డిమాండ్ చేశాడు. అతనిని అరెస్టు చేయకుండా, అతనిపై తదుపరి చర్యలు తీసుకోకుండా ఉండటానికి రూ.4 లక్షల లంచం లంచం డిమాండ్ చేసి… అందులో మొదటి విడుతగా రూ.2 ల‌క్ష‌లు తీసుకున్నాడు.

మిగిలిన నగదు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఎస్ఐ జగదీష్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement