ఎమ్మెల్యే రోజా విమాన ప్రమాదం నుంచి బయటపడ్డారు. హైదరాబాద్ నుంచి తిరుపతికి రోజా పయనమయ్యారు. సాంకేతిక సమస్యతో తిరుపతిలో ల్యాండింగ్ కాలేదు. ప్రమాదాన్ని తప్పించి బెంగళూరుకు ఫ్లైట్ ని మళ్ళించాడు ఫైలట్. ఈ మేరకు రోజా ఓ వీడియోని రిలీజ్ చేశారు. తాము ఇంకా ఫ్లైట్ లోనే ఉన్నామని, డోర్స్ ఓపెన్ కాలేదని చెప్పారు.
ఎమ్మెల్యే రోజా విమాన ప్రమాదం నుంచి బయటపడ్డారు. రాజమండ్రి నుంచి తిరుపతికి రోజా పయనమయ్యారు. సాంకేతిక సమస్యతో తిరుపతిలో ల్యాండింగ్ కాలేదు. ప్రమాదాన్ని తప్పించి బెంగళూరుకు ఫ్లైట్ ని మళ్ళించాడు ఫైలట్. ఈ మేరకు రోజా ఓ వీడియోని రిలీజ్ చేశారు. తాము ఇంకా ఫ్లైట్ లోనే ఉన్నామని, డోర్స్ ఓపెన్ కాలేదని చెప్పారు. ల్యాండింగ్ చేస్తే ప్రమాదం జరిగే ముప్పుందని గ్రహించిన పైలట్.. విమానాన్ని కిందకు దించలేదు. రాజమండ్రి నుంచి 9.20 గంటలకు తిరుపతికి బయల్దేరిన ఇండిగో విమానం.. 10.20 గంటలకు తిరుపతిలో ల్యాండ్ అవ్వాల్సి ఉంది. అయితే, సమస్య పరిష్కారం కాకపోవడంతో విమానాన్ని బెంగళూరుకు మళ్లించి.. అక్కడ ల్యాండ్ చేశారు.
విమానాన్ని ల్యాండ్ చేసినా డోర్లు మాత్రం తెరవలేదు. దీంతో 4 గంటలుగా రోజా సహా మిగతా ప్రయాణికులంతా విమానంలోనే చిక్కుకుపోయారు. ఎమ్మెల్యే రోజాతో పాటు పలువురు ప్రముఖులు విమానంలో ఉన్నారు. దీనికి సంబంధించి రోజా వీడియోను కూడా విడుదల చేశారు. డోర్లు కూడా తెరవడం లేదని, తిరుపతిలో ల్యాండ్ కావాల్సిన విమానాన్ని బెంగళూరులో దింపారని .. గ్రౌండ్ లో పరిస్థితేంటో తెలియదని చెప్పారు. దీనిపై ఆమె ఫోన్ లో విలేకర్లతో మాట్లాడారు. నాలుగు గంటలుగా విమానంలోనే ఉండిపోయామని చెప్పారు. బెంగళూరు ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేసినా.. అక్కడ పర్మిషన్ ఉందో లేదో చెప్పట్లేదన్నారు. డోర్లు కూడా తెరవడం లేదని తెలిపారు. మబ్బులున్నాయని, కింద రన్ వే కనిపించడం లేదని ఫ్లైట్ లో అనౌన్స్ చేశారని, కానీ, అది సాంకేతిక సమస్యని బెంగళూరుకు వచ్చాకే తెలిసిందని ఆమె చెప్పారు.
విమానంలో తలెత్తిన సమస్యను పరిష్కరించేందుకే బెంగళూరుకు వచ్చామని ఫ్లైట్ అధికారులు చెప్పారన్నారు. తనకిలా జరగడం ఇది రెండోసారన్నారు. అంతకుముందు హైదరాబాద్ లో విమానం టైర్ పేలిపోయి రాత్రి 10.40 గంటల సమయంలో ఇలాగే డోర్లు క్లోజ్ చేసి పెట్టారని గుర్తు చేశారు. ఇటీవలే తనకు మేజర్ ఆపరేషన్ అయిందని, ఒకే చోట నాలుగు గంటలు తాను కూర్చోలేనంటూ పైలట్ తో మాట్లాడానని ఆమె తెలిపారు. తనతో పాటు లావణ్య అనే తన కజిన్ విమానంలో ఉన్నారని చెప్పారు. తన పొట్టకు 29 కుట్లు వేశారన్నారు. దాని వల్ల పొట్ట మీద భారం పడుతుందన్నారు. చాలా నొప్పిగా, బాధగా ఉందని ఆమె పేర్కొన్నారు. మెడికల్ గ్రౌండ్ లో దింపుతామని, అయితే, దానిని చెక్ చేసేందుకు సంబంధిత అధికారులు రావాల్సి ఉందని ఫ్లైట్ అటెండెంట్ చెప్పారని తెలిపారు. ఇదే విమానంలో మాజీ మంత్రి యనమల కూడా ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.