Tuesday, November 19, 2024

Breaking : గ్రామ సచివాలయాలతో మెరుగైన సేవలు .. మంత్రి పేర్ని నాని..

మచిలీపట్నం ప్రభ న్యూస్ : గ్రామ సచివాలయాల వ్యవస్థతో ప్రభుత్వ సేవలు మరింత చేరువవుతాయని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం మండలంలోని వాడపాలేం గ్రామ సచివాలయాన్ని మంత్రి పేర్ని నాని ప్రారంభించారు. రూ.40 లక్షల ఎంజిఎన్ఆర్‌ఈజీఎస్ నిధులతో, ఆధునిక వసతులతో నిర్మించిన ఈ సచివాలయం ప్రారంభోత్స‌వం అనంత‌రం, మెడిశెట్టివారి దేవర అమ్మవారి గుడి వద్ద జరిగిన గ్రామసభలో మంత్రి పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. సచివాలయ వ్యవస్థ ద్వారా ముఖ్యమంత్రి జ‌గ‌న్ అవినీతిరహితమైన, పారదర్శక పాలన సాగిస్తున్నారన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకున్నా దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్న ఘనత జగన్ ప్రభుత్వానిదేనన్నారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం మాజీ జడ్పిటీసి లంకె వెంకటేశ్వరరావు( ఎల్వీయార్), వాడపాలెం సర్పంచ్ మేడిశెట్టి రాజ్ కుమార్, డ్వామా పి డీ , మచిలీపట్నం ఎంపీడీఓ జి. సూర్యనారాయణ, బ్యాంక్ అధ్యక్షులు మేడిశెట్టి వేణుగోపాల్ ప్రసాద్, కె పి టి పాలెం సర్పంచ్ రేమాని చంద్రవంక తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement