సీనియర్ హీరో మోహన్ బాబు విజయవాడకి వెళ్ళారు..దాంతో ఆయనకి గన్నవరం ఎయిర్ పోర్టులో అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఆత్మీయులను కలవడానికే మోహన్ బాబు విజయవాడ వచ్చినట్టు తెలిపారు. అభిమానులను కలవడం ఆనందంగా ఉందన్నారు. ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తల్లి రంగనాయకమ్మ ఇటీవల మృతి చెందారు. దాంతో ఆ కుటుంబాన్ని పరామర్శించనున్నారు మోహన్‌బాబు. ఆ తర్వాత సీఎం జగన్‌ను కూడా కలిసే అవకాశమున్నట్టు సమాచారం.
Advertisement
తాజా వార్తలు
Advertisement